మోడీ ఇంగ్లీష్ సీక్రెట్ చెప్పిన మమతా

ప్రధాని నరేంద్రమోడీ పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ పథకాల ద్వారా వ్యక్తిగత ప్రతిష్ట కోసం మోడీ పాకులాడుతున్నారని ఆమె విమర్శించారు. మోడీ ఇంగ్లీష్‌ పైనా కామెంట్స్ చేశారామె. మోడీకి సొంతంగా ఒక్క లైన్ ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదని ఎద్దేవా చేశారు. మోడీ ఇప్పటి వరకు చాలా సార్లు ఇంగ్లీష్‌లో ప్రసంగాలు ఇచ్చారని…. కానీ అవన్నీ సొంతంగా ఇచ్చినవి కాదన్నారు. ఎదురుగా టెలి ప్రామిటర్‌ పెట్టుకుని అందులో వచ్చే ఇంగ్లీష్‌ను మోడీ […]

Advertisement
Update:2019-01-11 11:17 IST

ప్రధాని నరేంద్రమోడీ పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ పథకాల ద్వారా వ్యక్తిగత ప్రతిష్ట కోసం మోడీ పాకులాడుతున్నారని ఆమె విమర్శించారు. మోడీ ఇంగ్లీష్‌ పైనా కామెంట్స్ చేశారామె. మోడీకి సొంతంగా ఒక్క లైన్ ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదని ఎద్దేవా చేశారు.

మోడీ ఇప్పటి వరకు చాలా సార్లు ఇంగ్లీష్‌లో ప్రసంగాలు ఇచ్చారని…. కానీ అవన్నీ సొంతంగా ఇచ్చినవి కాదన్నారు. ఎదురుగా టెలి ప్రామిటర్‌ పెట్టుకుని అందులో వచ్చే ఇంగ్లీష్‌ను మోడీ చదువుతుంటారని వివరించారు. ఈ విషయం మీడియా ప్రతినిధులతో పాటు చాలా మందికి తెలుసన్నారు మమతా.

టెలి ప్రామిటర్‌లో చూసి చదువుతూ ఇంగ్లీష్ వచ్చిన వాడిలా మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం పైనా విమర్శలు చేశారు. ఈ పథకాన్ని మోడీ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ పథకానికి సంబంధించిన కార్డులను మోడీ ఫొటోతో ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నారని… మరి అలాంటప్పుడు ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు ఎందుకు కేటాయించాలని ఆమె ప్రశ్నించారు.

ఆయుష్మాన్ భారత్‌ పథకంలో 60 శాతం ఖర్చును కేంద్రం, 40 శాతం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. 10 కోట్ల మంది పేదలకు ఆరోగ్య భద్రత కోసం ఈ పథకం తీసుకొచ్చారు.

Tags:    
Advertisement

Similar News