తన దుస్థితిపై ముఖ్యమంత్రి ఆవేదన

కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా తన పరిస్థితి దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. తానో ముఖ్యమంత్రిగా కాకుండా గుమస్తాగా బతుకుతున్నానని ఆవేదన చెందారు. ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు. తమకు అనుకూలంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ బలవంతపెడుతోందని ఆరోపించారు. పాలనపై ముఖ్యమంత్రిగా తన ప్రభావం ఏమీ లేదని చెప్పారు. బెంగళూరులో జరిగిన జేడీఎస్ శాసనసభ పక్ష సమావేశంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దుస్థితిని […]

Advertisement
Update:2019-01-10 03:53 IST

కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా తన పరిస్థితి దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. తానో ముఖ్యమంత్రిగా కాకుండా గుమస్తాగా బతుకుతున్నానని ఆవేదన చెందారు.

ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు. తమకు అనుకూలంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ బలవంతపెడుతోందని ఆరోపించారు. పాలనపై ముఖ్యమంత్రిగా తన ప్రభావం ఏమీ లేదని చెప్పారు. బెంగళూరులో జరిగిన జేడీఎస్ శాసనసభ పక్ష సమావేశంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ దుస్థితిని లోక్‌సభ ఎన్నికల వరకు తాను పంటిబిగువన భరిస్తానని ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామన్నారు. బదిలీల నుంచి నామినేటెడ్‌ పోస్టుల భర్తీ వరకు అంతా కాంగ్రెస్‌ చెబుతున్నట్టే చేయాల్సి వస్తోందన్నారు. తన బాధేంటో అనుభవించే వారికే తెలుస్తుందన్నారు కుమారస్వామి.

ప్రతి అధికారి కాంగ్రెస్ సిఫార్సు లేఖతో తన వద్దకు వస్తున్నారని నిస్సహాయత వ్యక్తం చేశారు. 222 మంది సభ్యులున్న కర్నాటక అసెంబ్లీలో బీజేపీకి 104 సభ్యుల బలం ఉంది. జేడీఎస్‌కు కేవలం 37 స్థానాలు మాత్రమే వచ్చాయి. అయితే 80 సీట్లు సాధించిన కాంగ్రెస్‌ మద్దతుతో కుమారస్వామి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు.

Tags:    
Advertisement

Similar News