క్రికెట్‌కు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ గుడ్‌బై

క్రికెట్‌కు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ అల్బీ మోర్కెల్ గుడ్‌బై చెప్పారు. 37 ఏళ్ల అల్బీ తన క్రికెట్‌ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్టు వెల్లడించారు. ఇకపై క్రికెట్‌ను మరో విధంగా ఆస్వాదిస్తానని చెప్పారు. అన్ని ఫార్మట్‌లకు అల్బీ గుడ్‌బై చెప్పేశారు. ఆల్‌రౌండర్‌గా దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రికెట్‌ కేరీర్‌ను అల్బీ సాగించారు. అల్బీ మోర్కెల్ 58 వన్డేలు, 50 టీ20 మ్యాచ్‌లను ఆడారు. 77 వికెట్లు పడగొట్టాడు. 1,412 పరుగులు చేశాడు. 2011 చెన్నై సూపర్ కింగ్స్‌ తరపున ఐపీఎల్ […]

Advertisement
Update:2019-01-10 02:04 IST
క్రికెట్‌కు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ గుడ్‌బై
  • whatsapp icon

క్రికెట్‌కు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ అల్బీ మోర్కెల్ గుడ్‌బై చెప్పారు. 37 ఏళ్ల అల్బీ తన క్రికెట్‌ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్టు వెల్లడించారు. ఇకపై క్రికెట్‌ను మరో విధంగా ఆస్వాదిస్తానని చెప్పారు. అన్ని ఫార్మట్‌లకు అల్బీ గుడ్‌బై చెప్పేశారు. ఆల్‌రౌండర్‌గా దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రికెట్‌ కేరీర్‌ను అల్బీ సాగించారు.

అల్బీ మోర్కెల్ 58 వన్డేలు, 50 టీ20 మ్యాచ్‌లను ఆడారు. 77 వికెట్లు పడగొట్టాడు. 1,412 పరుగులు చేశాడు. 2011 చెన్నై సూపర్ కింగ్స్‌ తరపున ఐపీఎల్ ఆడాడు. తన సుధీర్ఘ కేరీర్‌ను ఎంతో ఆస్వాదించానని… కొన్ని స్వీట్ మెమోరీస్‌… కొన్ని చేదు జ్ఞాపకాలతో తన కేరీర్ కొనసాగిందని అల్బీ గుర్తు చేసుకున్నారు. తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై ఆటను మరో కోణం నుంచి ఆస్వాదిస్తానని అల్బీ వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News