జగన్ కు వ్యతిరేకంగా వైసీపీ వ్యవస్థాపకుడి ధర్నా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ అభిమానులు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా పిలుపునిచ్చి… వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ ఆందోళనకు దిగారు. సరైన కారణం లేకుండా తనను పార్టీ నుంచి బహిష్కరించారంటూ హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నాకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి అనుచరులతో కలిసి నిరసన తెలిపారు. పార్టీని స్థాపించి, కష్టపడి ఇంతకాలం పనిచేసిన తనను పార్టీ నుంచి బహిష్కరించే హక్కు జగన్‌మోహన్ రెడ్డికి లేదని […]

Advertisement
Update: 2019-01-07 21:30 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ అభిమానులు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా పిలుపునిచ్చి… వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ ఆందోళనకు దిగారు.

సరైన కారణం లేకుండా తనను పార్టీ నుంచి బహిష్కరించారంటూ హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నాకు దిగారు.

నల్ల బ్యాడ్జీలు ధరించి అనుచరులతో కలిసి నిరసన తెలిపారు. పార్టీని స్థాపించి, కష్టపడి ఇంతకాలం పనిచేసిన తనను పార్టీ నుంచి బహిష్కరించే హక్కు జగన్‌మోహన్ రెడ్డికి లేదని శివకుమార్ మండిపడ్డారు.

కేవలం ధనవంతులకు మాత్రమే వైసీపీలో జగన్‌ చోటిస్తున్నారని… తన లాంటి వారిని పక్కనపెడుతున్నారని విమర్శించారు. తనకు జగన్‌ చేసిన అన్యాయాన్ని ఏపీలోని ప్రతి జిల్లాకు వెళ్లి వివరిస్తానని చెప్పారు.

వైసీపీని స్థాపించింది తానని… జగన్‌కు ఏమాత్రం నిజాయితీ ఉన్నాసరే సొంతంగా పార్టీని స్థాపించుకోవాలని వైసీపీ వ్యవస్థాపకుడైన శివకుమార్ డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News