అఖిలప్రియ దారిలో భూమా బ్రహ్మానందరెడ్డి కీలక నిర్ణయం
కర్నూలు జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. నంద్యాలకు చెందిన ఫరూక్ మంత్రి పదవి చేపట్టిన తర్వాత నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతంలో టీడీపీ రెండుగా చీలిపోయింది. భూమా కుటుంబానికి చెక్ పెట్టేందుకు ఫరూక్ ప్రయత్నిస్తుండడం, పోలీసులు కూడా భూమా వర్గీయులను టార్గెట్ చేయడంతో రచ్చ మొదలైంది. కొద్ది రోజుల క్రితం కార్డన్ సెర్చ్ పేరుతో ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుల ఇళ్లపైనే పోలీసులు దాడులు చేశారు. తన అనుచరులపైనే పోలీసులు దాడి చేయడంతో […]
కర్నూలు జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. నంద్యాలకు చెందిన ఫరూక్ మంత్రి పదవి చేపట్టిన తర్వాత నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతంలో టీడీపీ రెండుగా చీలిపోయింది.
భూమా కుటుంబానికి చెక్ పెట్టేందుకు ఫరూక్ ప్రయత్నిస్తుండడం, పోలీసులు కూడా భూమా వర్గీయులను టార్గెట్ చేయడంతో రచ్చ మొదలైంది. కొద్ది రోజుల క్రితం కార్డన్ సెర్చ్ పేరుతో ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుల ఇళ్లపైనే పోలీసులు దాడులు చేశారు. తన అనుచరులపైనే పోలీసులు దాడి చేయడంతో అఖిలప్రియ కంగుతిన్నారు.
విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమె ఇటీవలే తన గన్‌మెన్లకు వెనక్కు పంపించారు. గన్‌మెన్లు, పోలీసుల సెక్యూరిటీ లేకుండానే అఖిలప్రియ పర్యటనలు చేస్తున్నారు. తన అనుచరులపైనే పోలీసులు దాడులు చేస్తున్నప్పుడు ఇక తనకు గన్‌మెన్లు ఎందుకని ఆమె తిరస్కరించారు.
ఇప్పుడు తన సోదరి అఖిలప్రియకు సంఘీభావంగా భూమా బ్రహ్మానందరెడ్డి కూడా తన గన్‌మెన్లను వెనక్కు పంపించారు. తమ అనుచరులపై దాడులు జరుగుతుంటే తాము గన్‌మెన్లను పెట్టుకుని తిరగదలుచుకోలేదని బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు.
పెద్దల అండ లేకపోవడంతో భూమా అఖిలప్రియను, భూమా బ్రహ్మానందరెడ్డిని టీడీపీలోని మరో వర్గం టార్గెట్ చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డికి టికెట్ దక్కకుండా చేసేందుకు ఫరూక్, ఎస్పీవై రెడ్డి పావులు కదుపుతున్నారు. నంద్యాల అసెంబ్లీ టికెట్ ఈసారి తమదేనని ఇటీవల ఎస్పీవై రెడ్డి మీడియా ముందే ప్రకటించారు.