లోక్‌సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన కోమటిరెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ఘోర ఓటమికి టీడీపీతో పొత్తే కారణమని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీతో పొత్తు వద్దు అని హైకమాండ్‌ను ముందే హెచ్చరించామని… కానీ పట్టించుకోలేదన్నారు. ఎంత దారుణమైన పరిస్థితులున్నా కాంగ్రెస్‌కు కనీసం 45 వస్తాయని అంచనా వేశానన్నారు. కానీ టీడీపీ పొత్తు వల్ల బాగా దెబ్బతినిపోయామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వద్దని కాంగ్రెస్ హైకమాండ్‌కు చెప్పి వచ్చామన్నారు. టీడీపీతో పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్తే కనీసం ఏడు నుంచి ఎనిమిది లోక్‌సభ […]

Advertisement
Update:2019-01-06 03:11 IST

తెలంగాణలో కాంగ్రెస్ ఘోర ఓటమికి టీడీపీతో పొత్తే కారణమని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీతో పొత్తు వద్దు అని హైకమాండ్‌ను ముందే హెచ్చరించామని… కానీ పట్టించుకోలేదన్నారు.

ఎంత దారుణమైన పరిస్థితులున్నా కాంగ్రెస్‌కు కనీసం 45 వస్తాయని అంచనా వేశానన్నారు. కానీ టీడీపీ పొత్తు వల్ల బాగా దెబ్బతినిపోయామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వద్దని కాంగ్రెస్ హైకమాండ్‌కు చెప్పి వచ్చామన్నారు.

టీడీపీతో పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్తే కనీసం ఏడు నుంచి ఎనిమిది లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటుందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌- టీడీపీ కూటమికి వ్యతిరేకంగా ప్రజలను ఒప్పించడంలో కేసీఆర్‌ విజయం సాధించారన్నారు.

కాంగ్రెస్‌ కూటమి గెలిస్తే తెలంగాణలో చంద్రబాబు పెత్తనం వస్తుందన్న అంశాన్ని కేసీఆర్‌ జనంలోకి బాగా తీసుకెళ్లారని దాని వల్లే నష్టపోయామన్నారు. టీడీపీతో పొత్తు కారణంగా ముఖ్యంగా ఉద్యోగులు, యువత కాంగ్రెస్‌కు దూరమయ్యారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విశ్లేషించారు.

Tags:    
Advertisement

Similar News