8వేల కోట్ల హీరా గ్రూప్ స్కాం.... నౌహీరా అరెస్టు
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా వేల కోట్ల డిపాజిట్లు వసూలు చేసి మోసం చేసిన హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్‌ను ఇవాళ ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను మరి కొద్ది సేపట్లో చిత్తూరు కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. అనేక స్కీముల పేరుతో వేలాది మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడటమే కాకుండా…. నౌహీరా సారథ్యంలోని హీరా గ్రూప్‌నకు ఉగ్రవాదులతో కూడా సంబంధాలున్నాయని పోలీసులు […]
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా వేల కోట్ల డిపాజిట్లు వసూలు చేసి మోసం చేసిన హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్‌ను ఇవాళ ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను మరి కొద్ది సేపట్లో చిత్తూరు కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐడీ పోలీసులు తెలిపారు.
అనేక స్కీముల పేరుతో వేలాది మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడటమే కాకుండా…. నౌహీరా సారథ్యంలోని హీరా గ్రూప్‌నకు ఉగ్రవాదులతో కూడా సంబంధాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. హీరా గ్రూప్‌లో ఉగ్రవాదులకు సంబంధించిన డిపాజిట్లు ఉన్నాయని…. ఈ విషయంపై మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని పోలీసులు అంటున్నారు.
దేశవ్యాప్తంగా నౌహీరా మోసాలు ఉండటమే కాకుండా పలు బ్యాంకు ఖాతాలను కూడా నిర్వహించారని…. విదేశాల్లో కూడా ఈమెకు బ్యాంకు ఖాతాలు ఉండే అవకాశం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో జాతీయ, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల సహకారాన్ని ఏపీ సీఐడీ కోరింది. 8 విదేశీ బ్యాంకుల్లో వందల కోట్ల రూపాయల లావాదేవీలను హీరా గ్రూప్ నిర్వహించినట్లు తేలింది. ఇప్పటి వరకు సీఐడీ దర్యాప్తులో హీరా గ్రూప్ స్కాం విలువ 8 వేల కోట్ల రూపాయలు ఉంటుందనే అంచనాకు వచ్చారు.
మరోవైపు హీరా గ్రూప్ ఫెమా నిబంధనలు కూడా ఉల్లంఘించి నిధులను అక్రమంగా ఉపయోగించినట్లు సీసీఎస్ పోలీసులు చెబుతున్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయల స్కాం వెనుక రాజకీయ నాయకులు హస్తం కూడా ఉండే అవకాశం లేకపోలేదని.. అందుకే మరింత లోతైన దర్యాప్తు కోసం నౌహీరా కస్టడీని పోలీసులు కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.