కేసీఆర్ పై కేసుపెట్టిన ఎస్వీమోహన్‌ రెడ్డి

చంద్రబాబు ఫొటోలను వాడుకుంటూ వెన్నుపోటు పాటను విడుదల చేసిన వర్మపై తొలుత కేసు పెట్టిన ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా కేసీఆర్ పై ఫిర్యాదు చేశాడు. శనివారం మీడియా సమావేశంలో చంద్రబాబుపై కేసీఆర్ ఘాటు పదాలతో హాట్ హాట్ గా కామెంట్స్ చేసిన నేపథ్యంలో కేసీఆర్ పై ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.  ఆదివారం ఉదయం ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు టౌన్ పోలీస్ స్టేషన్ […]

Advertisement
Update:2018-12-30 07:25 IST

చంద్రబాబు ఫొటోలను వాడుకుంటూ వెన్నుపోటు పాటను విడుదల చేసిన వర్మపై తొలుత కేసు పెట్టిన ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా కేసీఆర్ పై ఫిర్యాదు చేశాడు.

శనివారం మీడియా సమావేశంలో చంద్రబాబుపై కేసీఆర్ ఘాటు పదాలతో హాట్ హాట్ గా కామెంట్స్ చేసిన నేపథ్యంలో కేసీఆర్ పై ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆదివారం ఉదయం ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసీఆర్ పై ఫిర్యాదు చేశాడు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ పై విరుచుకుపడ్డాడు. అందరూ విమర్శలతో భయపెడుతుంటే… ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాత్రం ప్రత్యర్థులపై ఫిర్యాదు చేస్తూ కేసులు పెడుతూ తనదైన పంథాను కొనసాగిస్తున్నాడు.

 

Tags:    
Advertisement

Similar News