"మీ బతుకులు చెడ" అని కేసీఆర్ ఊరికే అనలే!

“తూ మీ బతుకులు చెడ” ఈ వ్యాఖ్యలు ఎంత పాపులర్ అయ్యాయో అందరికీ తెలుసు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గత నెలలో మహాకూటమిని ఉద్దేశించి ”తూ మీ బతుకులు చెడ” అని చేసిన వ్యాఖ్యలివి. అయితే ఇప్పుడు తాజాగా ఇవే వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిగ్గా మారాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తనదైన శైలిలో మండిపడ్డారు. హైకోర్టు విభజనకు సంబంధించి కేంద్రం నుంచి నోటిఫికేషన్ రావడంతో…. చంద్రబాబు దానిపై అసంతృప్తి […]

Advertisement
Update:2018-12-29 04:14 IST

“తూ మీ బతుకులు చెడ” ఈ వ్యాఖ్యలు ఎంత పాపులర్ అయ్యాయో అందరికీ తెలుసు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గత నెలలో మహాకూటమిని ఉద్దేశించి ”తూ మీ బతుకులు చెడ” అని చేసిన వ్యాఖ్యలివి.

అయితే ఇప్పుడు తాజాగా ఇవే వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిగ్గా మారాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తనదైన శైలిలో మండిపడ్డారు.

హైకోర్టు విభజనకు సంబంధించి కేంద్రం నుంచి నోటిఫికేషన్ రావడంతో…. చంద్రబాబు దానిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఏపీ సర్కారుతో సంప్రదించకుండా కేంద్రం ఎలా నిర్ణయం తీసుకుంటుందని బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ట్విట్టర్ వేదికగా బాబుకు కౌంటర్ ఇచ్చారు.

యూ-టర్న్ సీఎం చంద్రబాబు హైకోర్టు విషయంలో ప్లేటు మార్చారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీల అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రకు ప్రత్యేక హైకోర్టుకు సహకరిస్తే చంద్రబాబు నీచంగా రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. నిన్నకు నిన్న క్రెడిట్ తమదేనని ఎంపీ కే. రవీంద్ర కుమార్ డబ్బా కొట్టుకున్నారని గుర్తు చేశారు. ”మీ బతుకులు చెడ” అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఊరికే అనలేదంటూ జీవీఎల్‌ ఎద్దేవా చేశారు.

Tags:    
Advertisement

Similar News