విశాఖ ఎయిర్ షో రద్దు
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవాల్లో ఇవాళ ఏర్పాటు చేసిన ఎయిర్ షో అర్థాంతరంగా రద్దు అయింది. విశాఖ సముద్ర తీరంలో 9 యుద్ద విమానాలతో సహా 90 మంది నావికా దళ సిబ్బంది ఈ ఎయిర్‌షోలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ షోకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో రద్దు చేయాల్సి వచ్చింది. వాస్తవానికి విశాఖ ఉత్సవాలకు ఏర్పాట్లు ఆదరాబాదరాగా చేశారు. దీంతో ఎయిర్‌షోకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో కూడా జాప్యం జరిగింది. సరైన ఏర్పాట్లు […]
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవాల్లో ఇవాళ ఏర్పాటు చేసిన ఎయిర్ షో అర్థాంతరంగా రద్దు అయింది. విశాఖ సముద్ర తీరంలో 9 యుద్ద విమానాలతో సహా 90 మంది నావికా దళ సిబ్బంది ఈ ఎయిర్‌షోలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ షోకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో రద్దు చేయాల్సి వచ్చింది.
వాస్తవానికి విశాఖ ఉత్సవాలకు ఏర్పాట్లు ఆదరాబాదరాగా చేశారు. దీంతో ఎయిర్‌షోకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో కూడా జాప్యం జరిగింది. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో పాటు కేంద్ర అనుమతుల కోసం రాష్ట్ర అధికారులు సకాలంలో అభ్యర్థనలు పంపలేదు. ఈ కారణాలతో కేంద్రం నుంచి అనుమతి లభించలేదని తెలుస్తోంది.
రక్షణ శాఖతో ఏపీ అధికారుల సమన్వయ లోపం వల్లే ఎయిర్‌షో రద్దు చేయాల్సి వచ్చినట్లు సమాచారం. ఇక విశాఖ ఉత్సవాల్లో ఎయిర్ షో కోసం ఎదురు చూస్తున్న నగరవాసులకు ఈ వార్త నిరాశను మిగిల్చింది. ఇక ముందైనా సరైన ఏర్పాట్లు ముందుగా చేయాలని కోరుతున్నారు