ఈజీగా శ్రీవారి దర్శనం.... తెలంగాణ టూరిజం విమాన ప్యాకేజీలు

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే వారి కోసం తెలంగాణ టూరిజం శాఖ విమాన ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చింది. ఒకరోజు, రెండు రోజుల ప్యాకేజీ ద్వారా సులువుగా శ్రీవారిని దర్శించుకోవచ్చు. రేణిగుంటలో విమానం దిగాక కొండపైకి తీసుకెళ్లడం దగ్గర నుంచి శ్రీవారి దర్శనం చేయించి… తిరిగి విమానంలో హైదరాబాద్‌ తీసుకొచ్చే వరకు మొత్తం ఏర్పాట్లన్నీ టూరిజం శాఖే చూసుకుంటుంది. ఒక రోజు ప్యాకేజి కింద ఒక్కొక్కరికి 11 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లిస్తే హైదరాబాద్‌ నుంచి […]

Advertisement
Update:2018-12-27 03:30 IST

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే వారి కోసం తెలంగాణ టూరిజం శాఖ విమాన ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చింది. ఒకరోజు, రెండు రోజుల ప్యాకేజీ ద్వారా సులువుగా శ్రీవారిని దర్శించుకోవచ్చు.

రేణిగుంటలో విమానం దిగాక కొండపైకి తీసుకెళ్లడం దగ్గర నుంచి శ్రీవారి దర్శనం చేయించి… తిరిగి విమానంలో హైదరాబాద్‌ తీసుకొచ్చే వరకు మొత్తం ఏర్పాట్లన్నీ టూరిజం శాఖే చూసుకుంటుంది.

ఒక రోజు ప్యాకేజి కింద ఒక్కొక్కరికి 11 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లిస్తే హైదరాబాద్‌ నుంచి విమానంలో తిరుపతి తీసుకెళ్తారు. అక్కడి నుంచి ఏసీ వాహనాల్లో కొండపైకి తీసుకెళ్లి శ్రీవారి దర్శనం చేయిస్తారు. ఆ తర్వాత కొండ మీద నుంచి కిందకు ఏసీ వాహనాల్లో తీసుకొచ్చి తిరుపతిలో ఉన్న పద్మావతి అమ్మవారి దర్శనం చేయించి తిరిగి విమానంలో హైదరాబాద్‌ తీసుకొస్తారు.

అదే రెండు రోజుల ప్యాకేజీ కోసం 14వేలు చెల్లించాల్సి ఉంటుంది. 14వేలు చెల్లిస్తే హైదరాబాద్‌ నుంచి విమానంలో తిరుపతి తీసుకెళ్లి అక్కడి నుంచి ఏసీ వాహనాల్లో కొండపైకి తీసుకెళ్లి శ్రీవారి దర్శనం చేయిస్తారు. తర్వాత కాణిపాకం, పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయాలకు తీసుకెళ్లి దర్శనం చేయించి తిరిగి రేణిగుంట చేరుకుని విమానం ద్వారా హైదరాబాద్ తీసుకొస్తారు.

ఈ రెండు ప్యాకేజీల్లోనూ దర్శనం, వసతి, ఆహారం టూరిజం వారే అందిస్తారు. విమాన యాత్ర కోసం స్సైస్ జెట్, ట్రూ జెట్‌ ఎయిర్‌లైన్స్‌తో తెలంగాణ టూరిజయం శాఖ ఒప్పందం చేసుకుంది. ఈ ప్యాకేజీ కోసం టూరిజం శాఖ కార్యాలయాలను సంప్రదించవచ్చు.

Tags:    
Advertisement

Similar News