జీఎస్టీ దెబ్బకు వెయ్యి కోట్ల రూపాయలు నష్టపోయిన బాబా రాందేవ్

బాబా రాందేవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పతంజలి ఆయుర్వేద సంస్థ తొలి సారిగా భారీ స్థాయిలో అమ్మకాల నష్టాలను మూటగట్టుకుంది. ఇందుకు జీఎస్టీనే ముఖ్య కారణం కావడం గమనార్హం. బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన జీఎస్టీపై పలు వ్యాపార వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా సరే కేంద్రం ఈ విషయం పై వెనక్కు తగ్గలేదు. దీంతో పలు రంగాలపై దీని ప్రభావం పడింది. ఇందులో ఫార్మ, ఆయుర్వేద కంపెనీలు కూడా ఉన్నాయి. దేశంలో ఆయుర్వేద ఉత్పత్తులకు […]

Advertisement
Update:2018-12-27 11:48 IST

బాబా రాందేవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పతంజలి ఆయుర్వేద సంస్థ తొలి సారిగా భారీ స్థాయిలో అమ్మకాల నష్టాలను మూటగట్టుకుంది. ఇందుకు జీఎస్టీనే ముఖ్య కారణం కావడం గమనార్హం.

బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన జీఎస్టీపై పలు వ్యాపార వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా సరే కేంద్రం ఈ విషయం పై వెనక్కు తగ్గలేదు. దీంతో పలు రంగాలపై దీని ప్రభావం పడింది. ఇందులో ఫార్మ, ఆయుర్వేద కంపెనీలు కూడా ఉన్నాయి.

దేశంలో ఆయుర్వేద ఉత్పత్తులకు మార్కెట్ లీడర్‌గా ఎదిగిన పతంజలి సంస్థ గత ఏడాదిలో 9,030 కోట్ల రూపాయల అమ్మకాలు సాధించింది. అయితే ఈ ఏడాది కేవలం 8135 కోట్ల అమ్మకాలతో 1000 కోట్ల మేర తక్కువ అమ్మకాలు సాధించింది. గత ఏడాది 1190 కోట్ల లాభం పొందగా.. ఈ ఏడాది కేవలం 529 కోట్ల రూపాయలకు పరిమితమైంది.

పతంజలి అమ్మకాల పతనానికి కారణం జీఎస్టీతో పాటు యూనీలివర్ వంటి కంపెనీలు ఆయుష్ పేరుమీద ఆయుర్వేద ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకోవడమే కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

Tags:    
Advertisement

Similar News