టికెట్‌ కోసం బలప్రదర్శన

వంగవీటి రాధా… వంగవీటి ఫ్యామిలీకి ఏపీ అంతటా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గడిచిన ఎన్నికల్లో బలమైన నేతగా తన వాళ్లకు ఈజీగా టికెట్ ఇప్పించుకున్న రాధా.. ఇప్పుడు తన టికెట్ కోసమే పోరాడాల్సిన పరిస్థితిలో ఉండడం బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బెజవాడ సెంట్రల్ నాదే అంటున్న రాధాకు.. ఆ ఒక్కటి అడగవద్దని అధిష్టానం నుంచి సమాచారం అందుతోందట.. మరి రాధా ఏం చేస్తారన్నది ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలకు […]

Advertisement
Update:2018-12-25 05:20 IST

వంగవీటి రాధా… వంగవీటి ఫ్యామిలీకి ఏపీ అంతటా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గడిచిన ఎన్నికల్లో బలమైన నేతగా తన వాళ్లకు ఈజీగా టికెట్ ఇప్పించుకున్న రాధా.. ఇప్పుడు తన టికెట్ కోసమే పోరాడాల్సిన పరిస్థితిలో ఉండడం బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బెజవాడ సెంట్రల్ నాదే అంటున్న రాధాకు.. ఆ ఒక్కటి అడగవద్దని అధిష్టానం నుంచి సమాచారం అందుతోందట.. మరి రాధా ఏం చేస్తారన్నది ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

ఎన్నికలకు ఇంకా 5 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ సీటుపై పీటముడితో ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారన్నది సస్పెన్స్ గా మారింది. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీచేస్తానని తాజాగా వంగవీటి రాధా వైసీపీ అధిష్టానానికి ప్రతిపాదనలు పంపారట.. కానీ వైసీపీ అధిష్టానం మాత్రం అక్కడ బలమైన నేత మల్లాది విష్ణువైపే మొగ్గు చూపిందట.. విజయవాడ సెంట్రల్ సమన్వయ కర్తగా ఇప్పటికే మల్లాది విష్ణును నియమించిన జగన్.. మరోమాటకు తావివ్వనని చెప్పారట.. దీంతో రాధ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది.

రాధా తండ్రి వంగవీటి రంగా ఇమేజ్ ఒకప్పుడు బెజవాడే కాదు కోస్తా ఆంధ్రా తీరం వెంట కూడా ప్రభావం చూపేది. రంగ హత్య తర్వాత ఆయన సతీమణి రత్నకుమారి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో రాధా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆతర్వాత వరుసగా రెండు సార్లు ఓటమి పాలయ్యారు. 2009లో పీఆర్పీ తరుపున విజయవాడ తూర్పులో పోటీచేసి ఓడిపోయారు. 2014లో కూడా విజయవాడ తూర్పు నుంచి వైసీపీ తరుఫున బరిలోకి దిగి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే రాధా పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడుతుంది. రాధాకు విజయవాడ తూర్పు బెటర్ అని… అక్కడ సర్వేలో వైసీపీ గెలుస్తుందని తేలిందని.. అక్కడే పోటీచేయాలని వైసీపీ అధిష్టానం చెబుతోంది. కానీ గత 2009, 2014లలో ఓడిపోయిన తూర్పు కన్నా సెంట్రల్ అయితేనే బెటర్ అన్న భావనలో రాధా ఉన్నారు. గతంలో తన అనుచరులకు టికెట్ ఇప్పించిన రాధా ఇప్పుడు తన టికెట్ కోసం పోరాడుతుండడం ఆయన అనుచరవర్గాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది.

అయితే వైసీపీ సీనియర్ నేతలు రాధాతో చర్చలు జరిపినా ఆయన ససేమిరా అంటున్నారు. దీంతో మల్లాది విష్ణుకే సెంట్రల్ అని చెప్పి విజయవాడ తూర్పు లేదా మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని రాధాకు వైసీపీ ఆఫర్ చేసిందట.. కానీ రాధా మాత్రం సెంట్రల్ పైనే పట్టుబడుతున్నాడట.. విజయవాడ సెంట్రల్ విషయంలో అధిష్టానం ఇవ్వకపోతే ఎలాంటి నిర్ణయమైనా తీసుకునేందుకు వెనుకాడడం లేదట రాధా. ఈ నెల 26న వంగవీటి రంగ వర్ధంతి రోజున బల ప్రదర్శన చేసి తన నిర్ణయాన్ని వెలువరించడానికి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిసింది.

Tags:    
Advertisement

Similar News