క్వార్టర్ ఖాళీ చేయండి... తుమ్మలకు ఫోన్
మొన్నటి వరకు కేసీఆర్ కేబినెట్‌లో చక్రం తిప్పిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఊహించని పరిణామం ఎదురైంది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన తుమ్మలను కేసీఆర్ టీఆర్‌ఎస్‌లోకి తీసుకుని ఎమ్మెల్సీని చేసి తొలుత మంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత పాలేరు ఉప ఎన్నికల్లో తుమ్మలను ఎమ్మెల్యేగా పోటీ చేయించి కేసీఆర్ గెలిపించుకున్నారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తుమ్మల ఓడిపోయారు. గెలిచి ఉంటే మంత్రి పదవి ఖాయంగా ఉండేది. […]
మొన్నటి వరకు కేసీఆర్ కేబినెట్‌లో చక్రం తిప్పిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఊహించని పరిణామం ఎదురైంది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన తుమ్మలను కేసీఆర్ టీఆర్‌ఎస్‌లోకి తీసుకుని ఎమ్మెల్సీని చేసి తొలుత మంత్రి పదవి ఇచ్చారు.
ఆ తర్వాత పాలేరు ఉప ఎన్నికల్లో తుమ్మలను ఎమ్మెల్యేగా పోటీ చేయించి కేసీఆర్ గెలిపించుకున్నారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తుమ్మల ఓడిపోయారు.
గెలిచి ఉంటే మంత్రి పదవి ఖాయంగా ఉండేది. ఓడిపోవడంతో తుమ్మల పరిస్థితి అయోమయంలో పడింది. అయితే కౌంటింగ్ రోజే తుమ్మలకు కేసీఆర్ ఫోన్ చేసి ధైర్యం చెప్పారు.
హైదరాబాద్ వచ్చి తనను కలవాల్సిందిగా సూచించారు. కేసీఆర్ తుమ్మల పట్ల చాలా సానుకూలంగా స్పందించడంతో ఈసారి కూడా తుమ్మలకు మండలి ద్వారా మంత్రి పదవి ఇస్తారని భావించారు.
తుమ్మల కూడా అదే ఊహించుకుంటూ వచ్చారు. కానీ హఠాత్తుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తుమ్మల నాగేశ్వర రావుకు ఫోన్ కాల్ వెళ్లింది. ”మీరు మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం మీకు కేటాయించిన క్వార్టర్‌ను వెంటనే ఖాళీ చేయండి” అని సీఎంవో అధికారులు తుమ్మలను కోరారు.
ఇది ముఖ్యమంత్రి ఆదేశం అని కూడా వివరించారు. సీఎంవో నుంచి ఫోన్ కాల్ వచ్చిన నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు… కొందరు టీఆర్‌ఎస్ ముఖ్యనేతలతో మాట్లాడారు. వారు మాత్రం ఇలాంటి సమాచారం తమకేమీ లేదని చెబుతున్నారు.
బహుశా ఎన్నికల సందర్భంగా తుమ్మల చేసిన కామెంట్సే ఆయనకు ఈ పరిస్థితిని కల్పించి ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా తుమ్మల…. నేను టీడీపీలోంచి టీఆర్ఎస్ లోకి రాకుండా ఉండాల్సింది… అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఆయనకు ఈ విధంగా నష్టం కలిగించాయని భావిస్తున్నారు. వీటికి తోడు అదుపులేని ఆయన నోరు కూడా ఆయనకు నష్టం కలిగించి ఉండవచ్చు.