మోడీ రైతు బంధు? బీజేపీకి ఓట్లు తీసుకొస్తుందా?
రైతు బంధు. తెలంగాణ ఎన్నికల్లో గేమ్ చేంజర్‌గా పనిచేసింది. ఎకరానికి నాలుగువేలు పెట్టుబడి సాయం… ఏడాదికి ఎనిమిదివేల రూపాయలు… రైతుల ఖాతాలో నేరుగా డబ్బులు వేయడం ఫలించింది. గులాబీ దళానికి ఓట్లు కుమ్మరించింది. ఇప్పుడు కేసీఆర్ బాటలోనే పలు రాష్ట్రాలు పయనిస్తున్నాయి. ఒడిషా, జార్ఖండ్‌లో కూడా రైతు బంధు స్కీమ్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. అక్కడ ఎన్నికలు రాబోతున్న వేళ ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు జాతీయస్థాయిలో కూడా రైతు బంధు తరహా స్కీమ్ తీసుకొచ్చేందుకు మోడీ […]
రైతు బంధు. తెలంగాణ ఎన్నికల్లో గేమ్ చేంజర్‌గా పనిచేసింది. ఎకరానికి నాలుగువేలు పెట్టుబడి సాయం… ఏడాదికి ఎనిమిదివేల రూపాయలు… రైతుల ఖాతాలో నేరుగా డబ్బులు వేయడం ఫలించింది. గులాబీ దళానికి ఓట్లు కుమ్మరించింది.
ఇప్పుడు కేసీఆర్ బాటలోనే పలు రాష్ట్రాలు పయనిస్తున్నాయి. ఒడిషా, జార్ఖండ్‌లో కూడా రైతు బంధు స్కీమ్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. అక్కడ ఎన్నికలు రాబోతున్న వేళ ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇప్పుడు జాతీయస్థాయిలో కూడా రైతు బంధు తరహా స్కీమ్ తీసుకొచ్చేందుకు మోడీ ప్రయత్నాలు ప్రారంభించారు.
2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బిజెపి, కాంగ్రెస్ ఫ్రంట్ లలో ఏది గెలిచినా రూ.2 లక్షల వరకూ రుణ మాఫీ అమలు తథ్యం అనిపిస్తోంది.
ఇలా మాఫీలు చేయడం కంటే రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక శాశ్వత ప్రణాళిక రూపొందించే పనిలో ఉంది. తెలంగాణలో అమలు జరుగుతున్న రైతుబంధు పథకం లాంటి దానికన్నా ఎక్కువ సహాయం అందించేలా రూపొందించేందుకు అధ్యయనం జరుగుతోంది. విత్తనాలు, పురుగు మందులు, రసాయన ఎరువులపై ప్రస్తుతం ఇస్తున్న రాయితీలను రైతులకు నేరుగా అందించే అవకాశం ఉంది. దీనిపై అమిత్ షా తన పార్టీ పక్షాన ఒక అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీని నియమించారు.
రైతులు ఎటువంటి సహాయం కోరుకుంటున్నారు? వ్యవసాయాన్ని గర్వించదగ్గ వృత్తిగా మార్చడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలేమిటి అనే అంశాలపై అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఒక ప్రపంచ స్థాయి సర్వే ఏజెన్సీని కూడా రంగంలోకి దించారు.
పంట రుణాలను ఇప్పటిలా ఏయేటికాయేడు కాకుండా మూడేళ్ల కోసారి చెల్లించే అవకాశాన్ని కల్పించనున్నారు. ప్రతి ఏటా రుణంపై వడ్డీని చెల్లిస్తే సరిపోతుంది. కొన్ని పంటలను నేరుగా విదేశాలకు ఎగుమతి చేసుకునేలా ప్రోత్సాహకాలు అందిస్తే రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. జనవరి నెలాఖరు నాటికి మోదీ ప్రభుత్వం రైతు అనుకూల పథకాల ప్రకటన చేస్తుందని తెలుస్తోంది.