మోడీకి గంటా వార్నింగ్‌

జనవరి 6.. ఇప్పుడు టీడీపీ నేతలు ఈ తేదీని టార్గెట్ చేశారా? ప్రధాని మోడీ ఆరోజే ఏపీ గడ్డమీదకొస్తున్నాడు. బీజేపీ అంటేనే ఒంటికాలిపై లేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు మోడీని టార్గెట్ చేశారా? ప్రజలను, కార్యకర్తలను రెచ్చగొట్టే పనికి తెరతీశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మోడీ జనవరి 6న గుంటూరులో పర్యటిస్తున్నారు. అక్కడ ఓ సభలో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ సభను ఎలాగైనా అభాసుపాలు చేయాలని.. అలజడి సృష్టించాలని.. మోడీకి షాకివ్వాలని టీడీపీ నేతలు […]

Advertisement
Update:2018-12-25 08:42 IST

జనవరి 6.. ఇప్పుడు టీడీపీ నేతలు ఈ తేదీని టార్గెట్ చేశారా? ప్రధాని మోడీ ఆరోజే ఏపీ గడ్డమీదకొస్తున్నాడు. బీజేపీ అంటేనే ఒంటికాలిపై లేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు మోడీని టార్గెట్ చేశారా? ప్రజలను, కార్యకర్తలను రెచ్చగొట్టే పనికి తెరతీశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.

మోడీ జనవరి 6న గుంటూరులో పర్యటిస్తున్నారు. అక్కడ ఓ సభలో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ సభను ఎలాగైనా అభాసుపాలు చేయాలని.. అలజడి సృష్టించాలని.. మోడీకి షాకివ్వాలని టీడీపీ నేతలు నిర్ణయించినట్టు వాళ్ల మాటలను బట్టి అర్థమవుతోంది.

అప్పట్లో తిరుపతిలో పర్యటించిన అమిత్ షాను కూడా అడ్డుకొని ఆయన వాహనంపై రాళ్లు రువ్వారు. అమిత్ షాను ఘోరంగా అవమానించారు. ఆ కేసు అతీగతీ లేకుండా పోయింది. ఇప్పుడు ప్రధాని మోడీ గుంటూరుకు వస్తుండడం…. రాజధానికి, టీడీపీకి పట్టున్న ప్రాంతం కావడంతో ఏం జరుగుతుందా అన్న టెన్షన్ అందరిలోనూ వ్యక్తమవుతోంది. మోడీని అవమానించేలా ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు ఏపీ ప్రత్యేక హోదాపై నిలదీసేలా టీడీపీ స్కెచ్ గీస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

తాజాగా మంగళవారం ఉదయం తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మోడీపై హాట్ కామెంట్ చేశారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్న మోడీ.. అది నెరవేర్చిన తర్వాతే ఏపీలో అడుగుపెట్టాలని.. లేకపోతే హామీలు నెరవేర్చకుండా వస్తున్నందుకు ప్రజలకు క్షమాపణ చెప్పి రావాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఏపీ ప్రజల చేతిలో ఆయన అభాసుపాలు అవుతారని హెచ్చరించారు. ప్రజలు అడ్డుకుంటారంటూ స్పష్టం చేశారు.

దీన్ని బట్టి జనవరి 6ను టీడీపీ నేతలు టార్గెట్ చేశారని అర్థమవుతోంది. చంద్రబాబు అండ్ కో కూడా మోడీ ఏపీ గడ్డపై అడుగుపెట్టడాన్ని జీర్ణించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో జనవరి 6న ఏం జరగబోతోందనే టెన్షన్ అందరినీ వెంటాడుతోంది.

Tags:    
Advertisement

Similar News