ఇళయరాజాపై రివర్స్‌లో కేసు

సంగీత దర్శకుడు ఇళయరాజాతో… నిర్మాతలు, సింగర్స్‌ వివాదం ముదురుతోంది. పలు కచేరీల్లో తన పాటలను సింగర్స్‌ పాడుతుండడంపై ఇటీవల ఇళయరాజా ఆగ్రహంగా ఉన్నారు. కేసులు వేసేందుకు సిద్ధమయ్యారు. తన అనుమతి లేకుండా, తనకు రాయల్టీ చెల్లించకుండా తన పాటలను పాడడానికి వీల్లేదని ఇళయరాజా వాదిస్తున్నారు. ఇకపై తన అనుమతి లేకుండా తన పాటలను ఏ వేదికపై కూడా పాడడానికి వీల్లేదని… అలా చేస్తే కేసులు వేస్తానని హెచ్చరించారు. ఇప్పటికే పలువురు నుంచి ఐదేళ్లుగా ఇళయరాజా రాయల్టీ కింద […]

Advertisement
Update:2018-12-23 05:38 IST

సంగీత దర్శకుడు ఇళయరాజాతో… నిర్మాతలు, సింగర్స్‌ వివాదం ముదురుతోంది. పలు కచేరీల్లో తన పాటలను సింగర్స్‌ పాడుతుండడంపై ఇటీవల ఇళయరాజా ఆగ్రహంగా ఉన్నారు. కేసులు వేసేందుకు సిద్ధమయ్యారు. తన అనుమతి లేకుండా, తనకు రాయల్టీ చెల్లించకుండా తన పాటలను పాడడానికి వీల్లేదని ఇళయరాజా వాదిస్తున్నారు.

ఇకపై తన అనుమతి లేకుండా తన పాటలను ఏ వేదికపై కూడా పాడడానికి వీల్లేదని… అలా చేస్తే కేసులు వేస్తానని హెచ్చరించారు. ఇప్పటికే పలువురు నుంచి ఐదేళ్లుగా ఇళయరాజా రాయల్టీ కింద డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. ఇళయరాజా ఇలా చేస్తుండడంపై నిర్మాతలు హైకోర్టులో కేసు వేశారు.

నిర్మాతలు సెల్వకుమార్, మీరాకధిరవన్, మణికంఠన్, చంద్రశేఖర్‌లు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తాను సంగీతం అందించిన పాటలపై పూర్తి హక్కులు తనకే ఉంటాయని ఇళయరాజా డబ్బులు వసూలు చేయడం చట్ట విరుద్దమని నిర్మాతలు కోర్టుకు వివరించారు.

నిర్మాతలు ఇచ్చే డబ్బుతో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారని… అలాంటప్పుడు పాటలపై ఆయనకే పూర్తి హక్కులు ఎలా ఉంటాయని నిర్మాత సెల్వకుమార్ ప్రశ్నించారు. ఇళయరాజా వసూలు చేసిన, వసూలు చేయబోతున్న రాయల్టీలో ఆయా చిత్ర నిర్మాతలకు 50 శాతం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును నిర్మాతలు కోరారు.

Tags:    
Advertisement

Similar News