ఓ.... ఆ బాహుబలి.... ఈయనేనా " ప్రభాస్ కేసులో జడ్జీ ఆసక్తికర వ్యాఖ్యలు
తన స్థలాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హీరో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. సీజ్ చేసిన తన ఇంటిని వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభాస్ కోర్టును కోరారు. అయితే కోర్టు అందుకు సానుకూలంగా స్పందించలేదు. ప్రభుత్వ వాదన పరిశీలించకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. మొత్తం వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభాస్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది నిరంజన్ రెడ్డి… స్థలాన్ని ప్రభాస్ ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు […]
తన స్థలాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హీరో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. సీజ్ చేసిన తన ఇంటిని వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభాస్ కోర్టును కోరారు.
అయితే కోర్టు అందుకు సానుకూలంగా స్పందించలేదు. ప్రభుత్వ వాదన పరిశీలించకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. మొత్తం వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రభాస్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది నిరంజన్ రెడ్డి… స్థలాన్ని ప్రభాస్ ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేశారని కోర్టుకు వివరించారు. అందులో ఎలాంటి వివాదం లేదన్నారు. అయినా సరే ప్రభుత్వ అధికారుల తీరును గమనించి ముందు జాగ్రత్తగా క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారని న్యాయవాది వివరించారు.
ఇందుకు ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. క్రమబద్దీకరణ పథకం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి కోసం ప్రభుత్వం తెచ్చిందన్నారు. దీంతో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి… పిటిషనర్ ప్రభాస్ దారిద్ర్య రేఖ పరిధిలోకి వస్తారా అని ఆరా తీసింది. ఇందుకు ప్రభుత్వ న్యాయవాది…. ప్రభాస్ దారిద్ర్య రేఖ పరిధిలో లేరని ఆయన ఒక బాహుబలి అని వ్యాఖ్యానించారు.
దీంతో న్యాయమూర్తి స్పందిస్తూ…. ఓ ఇతను ఆ బాహుబలినా… పిటిషన్‌లో ఉన్నది ఆ బాహుబలి పేరేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది కూడా ఆ బాహుబలే ఈ ప్రభాస్ అని వివరించారు. దీంతో ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
స్థలంలోని ఇంటిని ఇప్పటికిప్పుడు కూల్చే ఉద్దేశం తమకు లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. పిటిషనర్ వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తుందని చెప్పారు. కేసును ఈనెల 31కి వాయిదా వేసింది.