బీసీసీఐ నెత్తిన ఐసీసీ పిడుగు
160 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ హుకుం పరిహారం చెల్లిస్తేనే భారత్ వేదికగా 2023 ప్రపంచకప్ క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐకి…అంతర్జాతీయ క్రికెట్ మండలి భారీస్థాయిలో ఝలక్ ఇచ్చింది. డిసెంబర్ 31 లోగా 160 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ హుకుం జారీ చేసింది. పరిహారం చెల్లించలేకపోతే..2021 చాంపియన్స్ ట్రోఫీ, 2023 వన్డే ప్రపంచకప్ టోర్నీలకు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని చేజార్చుకోక తప్పదని హెచ్చరించింది. భారత్ వేదికగా 2016లో జరిగిన టీ-20 ప్రపంచకప్ కు…. పన్ను […]
- 160 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ హుకుం
- పరిహారం చెల్లిస్తేనే భారత్ వేదికగా 2023 ప్రపంచకప్
క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐకి…అంతర్జాతీయ క్రికెట్ మండలి భారీస్థాయిలో ఝలక్ ఇచ్చింది.
భారత్ వేదికగా 2016లో జరిగిన టీ-20 ప్రపంచకప్ కు….
పన్ను మినహాయింపు సాధించడంలో బీసీసీఐ విఫలమయ్యిందని…ఐసీసీ తేల్చి చెప్పింది. భారత ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు సాధించడంలో విఫలమైన బీసీసీఐ…ఆ లోటును భర్తీ చేయటానికి…23 మిలియన్ డాలర్లు నష్టపరిహారంగా చెల్లించక తప్పదని ఐసీసీ భావిస్తోంది.
ప్రపంచక్రికెట్ కే అతిపెద్ద మార్కెట్ గా ఉన్న భారత్ నుంచి వివిధ రూపాలలో లభిస్తున్న ఆదాయంతోనే మనుగడసాగిస్తూ వస్తున్న ఐసీసీ… చివరకు బీసీసీఐనే బెదిరించడం, హుకుం జారీచేయటం ఇప్పుడు క్రికెట్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.