ధోనికి ఇల్లు లేదట.... కట్టిపడేస్తున్న ధోని, చిన్నారి చిట్‌చాట్

ధోని ఈ మధ్య ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి బాగానే సమయం కేటాయిస్తున్నారు. కూతురు పక్కన ఉంటే ధోనికి టైమే తెలియడం లేదు. పార్టీలకు, పెళ్లిళ్లకు కూడా ధోని- సాక్షి దంపతులు బాగానే అటెండ్ అవుతున్నారు. అలా వెళ్లినప్పుడు తమకు ఎదురయ్యే తీపి అనుభవాలను ధోని భార్య సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. షాపింగ్‌కు వెళ్లిన ధోని ఒక చిన్నారిని ఎత్తుకుని ముద్దాడాడు. చిన్నారితో చిట్ చాట్ […]

Advertisement
Update:2018-12-22 11:35 IST

ధోని ఈ మధ్య ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి బాగానే సమయం కేటాయిస్తున్నారు. కూతురు పక్కన ఉంటే ధోనికి టైమే తెలియడం లేదు. పార్టీలకు, పెళ్లిళ్లకు కూడా ధోని- సాక్షి దంపతులు బాగానే అటెండ్ అవుతున్నారు. అలా వెళ్లినప్పుడు తమకు ఎదురయ్యే తీపి అనుభవాలను ధోని భార్య సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకుంటున్నారు.

ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. షాపింగ్‌కు వెళ్లిన ధోని ఒక చిన్నారిని ఎత్తుకుని ముద్దాడాడు. చిన్నారితో చిట్ చాట్ చేశాడు. ఆ అమ్మాయి అడిగిన బుజ్జిబుజ్జి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. చిన్నారి మీ ఇల్లు ఎక్కడ అని ప్రశ్నించగా… ధోని తనకు ఇల్లు లేదని చెప్పాడు. బస్సులోనే ఉంటానని… తనకు ఇల్లు లేదంటూ చిన్నారికి సమాధానం ఇచ్చారు.

ఈ వీడియోను ధోని భార్య సాక్షి తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశారు. చిన్నారి, ధోని మధ్య జరిగిన సంభాషణ చూడముచ్చటగా ఉండడంతో నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ధోనికి ఇల్లు లేకపోయినా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని తామంతా ధోనిని గుండెల్లో ఉంచుకుంటామని కొందరు వీరాభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News