తెలుగు రాష్ట్రాల్లో ఒక రోజు టీవీ చానళ్ల బంద్‌ " సంచలన నిర్ణయం

ట్రాయ్‌ తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై కేటుల్ ఆపరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాయ్ నిబంధనలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించారు. ట్రాయ్ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల వల్ల ఒక్కో చానల్‌ ప్రసారాలు అందించేందుకు తమకు అదనంగా 19 రూపాయల భారం పడుతుందని ఎంఎస్‌వోల నేత సుభాష్ రెడ్డి చెప్పారు. బ్రాడ్ కాస్టర్స్ ఒత్తిడి వల్లే ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ట్రాయ్‌పై పోరాటానికి తెలుగు రాష్ట్రాల కేబుల్ ఆపరేటర్ల జేఏసీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. పాత […]

Advertisement
Update:2018-12-22 16:01 IST

ట్రాయ్‌ తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై కేటుల్ ఆపరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాయ్ నిబంధనలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించారు. ట్రాయ్ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల వల్ల ఒక్కో చానల్‌ ప్రసారాలు అందించేందుకు తమకు అదనంగా 19 రూపాయల భారం పడుతుందని ఎంఎస్‌వోల నేత సుభాష్ రెడ్డి చెప్పారు.

బ్రాడ్ కాస్టర్స్ ఒత్తిడి వల్లే ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ట్రాయ్‌పై పోరాటానికి తెలుగు రాష్ట్రాల కేబుల్ ఆపరేటర్ల జేఏసీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

పాత ధరలకే సర్వీసులు ఇవ్వాలని కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్‌ఓల సమావేశంలో నిర్ణయించినట్టు సుభాష్ రెడ్డి చెప్పారు. ట్రాయ్ నిబంధనలను నిరసిస్తూ త్వరలోనే ఒక రోజు పాటు తెలుగు రాష్ట్రాల్లో అన్ని టీవీ చానళ్ల ప్రసారాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈనెల 27న ఇందిరాపార్కు వద్ద కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్‌వోల గర్జన నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News