నా పాత్రని నా మనవడు చేసాడు " బాలక్రిష్ణ

తెలుగు సినీ ప్రేక్షకులు  ఎదురు చూస్తున్న సినిమా “ఎన్టీఆర్” బయోపిక్. వచ్చే ఏడాది సంక్రాంతి సంధర్బంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా సినిమ ఆడియో లాంచ్ ని బాలక్రిష్ణ చాలా గ్రాండ్ గా నిర్వహించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్రని బాలక్రిష్ణ పోషిస్తే మరి బాలక్రిష్ణ పాత్రని ఎవరు పోషిస్తారు అనే అనుమానం అందరికి వచ్చింది. అయితే బాలయ్య పాత్రను మోక్షజ్ఞ చేస్తాడని కొందరు, కాదు కాదు జూనియర్ ఎన్టీఆర్ పోషించబోతున్నాడని కొన్నాళ్లు […]

Advertisement
Update:2018-12-22 07:14 IST

తెలుగు సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమా “ఎన్టీఆర్” బయోపిక్. వచ్చే ఏడాది సంక్రాంతి సంధర్బంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా సినిమ ఆడియో లాంచ్ ని బాలక్రిష్ణ చాలా గ్రాండ్ గా నిర్వహించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్రని బాలక్రిష్ణ పోషిస్తే మరి బాలక్రిష్ణ పాత్రని ఎవరు పోషిస్తారు అనే అనుమానం అందరికి వచ్చింది. అయితే బాలయ్య పాత్రను మోక్షజ్ఞ చేస్తాడని కొందరు, కాదు కాదు జూనియర్ ఎన్టీఆర్ పోషించబోతున్నాడని కొన్నాళ్లు వార్తలు వచ్చాయి.

అయితే బాలయ్య పెద్దయ్యాక పాత్ర సంగతేమో కాని చిన్నప్పటి పాత్రను మాత్రం ఆయన చిన్న మనవడు పోషించాడట. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వి కొడుకును “ఎన్టీఆర్” చిత్రంలో బాల బాలకృష్ణుడిగా చూపించబోతున్నారు. ఇంకా నెలలు కూడా ఉండని ఈ బుడ్డోడితో బాలక్రిష్ణ నటింపజేసాడు. తన మనవడు తన పాత్రలో నటించినందుకు బాలక్రిష్ణ ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఇక ఆడియో లాంచ్ లో తన మనవాడి గురించి కాసేపు మాట్లాడాడు బాలక్రిష్ణ. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హరిక్రిష్ణ పాత్రని కళ్యాణ్ రామ్ పోషించాడు.

Tags:    
Advertisement

Similar News