తల్లీకొడుకు ప్రాణాలు తీసిన బొగ్గుల కుంపటి.... జూబ్లీహిల్స్ లో దారుణం!

తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజులుగా చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. చలిని తట్టుకోలేక జనాలు వణికిపోతున్నారు. చలి బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే చలిని తట్టుకోలేక వెచ్చదనం కోసం ఇంట్లో బొగ్గుల కుంపటి పెట్టుకున్న ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఊపిరాడక తల్లీ కుమారుడు మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుంది. జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 25లోని ఓ ఇంట్లో పనిమనుషులుగా బుచ్చివేణి, ఆమె […]

Advertisement
Update:2018-12-20 02:36 IST

తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజులుగా చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. చలిని తట్టుకోలేక జనాలు వణికిపోతున్నారు. చలి బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే చలిని తట్టుకోలేక వెచ్చదనం కోసం ఇంట్లో బొగ్గుల కుంపటి పెట్టుకున్న ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఊపిరాడక తల్లీ కుమారుడు మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుంది.

జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 25లోని ఓ ఇంట్లో పనిమనుషులుగా బుచ్చివేణి, ఆమె కుమారుడు పద్మరాజు పనిచేస్తున్నారు. చలితీవ్రత పెరగడంతో ఇంట్లో బొగ్గుల కుంపటి పెట్టుకున్నారు. వేడిగా ఉండేందుకు తలుపులు, కిటికీలు మూసుకున్నారు. వాళ్లు నిద్రపోవడంతో ఇళ్లంతా పొగ కమ్ముకుంది. దీంతో ఊపిరాడకనే వీరిద్దరూ మరణించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    
Advertisement

Similar News