మౌన ముని విమర్శలపై మన్మోహన్‌ సింగ్‌ సమాధానం ఇదీ....

మన్మోహన్ సింగ్ ప్రధానిగా అనేక సమయాల్లో మౌనంగా ఉండడం ఆయన్ను తీవ్ర విమర్శల పాలు చేసింది. అప్పట్లో ప్రతిపక్షాలు మన్మోహన్‌ సింగ్‌ను మౌనముని, నిశబ్ధ ప్రధాని అంటూ హేళన కూడా చేశాయి. సోనియా చేతిలో కీలు బొమ్మ అన్న విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఆ విమర్శలను మన్మోహన్ సింగ్ ఏనాడు పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా తాను రాసిన ”చేంజింగ్ ఇండియా” పుస్తక ఆవిష్కరణ సందర్భంగా తనపై వచ్చిన విమర్శలకు మన్మోహన్ సింగ్ సమాధానం చెప్పారు. తనను సైలెంట్ […]

Advertisement
Update:2018-12-19 05:25 IST

మన్మోహన్ సింగ్ ప్రధానిగా అనేక సమయాల్లో మౌనంగా ఉండడం ఆయన్ను తీవ్ర విమర్శల పాలు చేసింది. అప్పట్లో ప్రతిపక్షాలు మన్మోహన్‌ సింగ్‌ను మౌనముని, నిశబ్ధ ప్రధాని అంటూ హేళన కూడా చేశాయి. సోనియా చేతిలో కీలు బొమ్మ అన్న విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.

ఆ విమర్శలను మన్మోహన్ సింగ్ ఏనాడు పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా తాను రాసిన ”చేంజింగ్ ఇండియా” పుస్తక ఆవిష్కరణ సందర్భంగా తనపై వచ్చిన విమర్శలకు మన్మోహన్ సింగ్ సమాధానం చెప్పారు. తనను సైలెంట్ పీఎం అని కొందరు ప్రజలు విమర్శించారని… అలాంటి వారికి తన పుస్తకంలో సమాధానాలు దొరుకుతాయన్నారు.

తాను మీడియాను చూసి భయపడ్డానని విమర్శించారని… కానీ తాను ఏనాడు మీడియాకు సమాధానం చెప్పేందుకు భయపడలేదన్నారు. తాను విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో మీడియాను వెంటపెట్టుకుని వెళ్లేవాడినని… విమానంలో గానీ.. ఆ తర్వాత గానీ మీడియా సమావేశాలు నిర్వహించేవాడినని చెప్పారు. మీడియాకు నిరంతరం అందుబాటులో ఉంటూ వచ్చానన్నారు.

తన జీవితంలో కొన్ని భాగాలు సజావుగా సాగాయని… మరికొన్ని సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నానని వివరించారు. తనను యాక్సిడెంటల్ ప్రధాని అని విమర్శిస్తుంటారని… తాను కేవలం యాక్సిడెంటల్‌ ప్రధానినే కాదని… యాక్సిడెంటల్‌గా ఆర్థిక మంత్రిని కూడా అయ్యానని మన్మోహన్ సింగ్ వివరించారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మన భారతదేశం ఒక సూపర్ పవర్‌గా ఎదిగి తీరుతుందని మన్మోహన్ సింగ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News