రాజకీయాల్లో వంద కోట్లు నష్టపోయిన నిర్మాత

తెలుగు ప్రేక్షకులకి నిర్మాత ఆనంద్ ప్రసాద్ పేరు తెలిసి ఉండక పోవచ్చు. కానీ భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ అని అంటే మాత్రం అందరూ గుర్తు పడతారు. ఆనంద ప్ర‌సాద్ ఇప్ప‌టివ‌ర‌కు ప‌లు సినిమాలు నిర్మించారు. అందులో ఆయ‌న‌కి వ‌చ్చిన విజ‌యాలు చాలా త‌క్కువే. గత ఏడాది నందమూరి బాలక్రిష్ణ తో “పైసా వసూల్” సినిమాని తెరకెక్కించి అట్టర్ ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు ఆనంద్ ప్రసాద్. అయితే అక్కడ నందమూరి బాలక్రిష్ణ తో ఏర్పడిన పరిచయం […]

Advertisement
Update:2018-12-17 07:30 IST

తెలుగు ప్రేక్షకులకి నిర్మాత ఆనంద్ ప్రసాద్ పేరు తెలిసి ఉండక పోవచ్చు. కానీ భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ అని అంటే మాత్రం అందరూ గుర్తు పడతారు. ఆనంద ప్ర‌సాద్ ఇప్ప‌టివ‌ర‌కు ప‌లు సినిమాలు నిర్మించారు. అందులో ఆయ‌న‌కి వ‌చ్చిన విజ‌యాలు చాలా త‌క్కువే.

గత ఏడాది నందమూరి బాలక్రిష్ణ తో “పైసా వసూల్” సినిమాని తెరకెక్కించి అట్టర్ ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు ఆనంద్ ప్రసాద్. అయితే అక్కడ నందమూరి బాలక్రిష్ణ తో ఏర్పడిన పరిచయం వల్ల ఆనంద్ ప్రసాద్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చాలా కాన్ఫిడెంట్‌గా శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్ధిగా దిగాడు.

అయితే అక్క‌డ రెబెల్స్‌ని తప్పించడానికి చాలానే ఖర్చు అయ్యిందట. అలాగే త‌న వంతుగా మ‌రో ఇద్ద‌రి అభ్య‌ర్థుల ఖ‌ర్చు పెట్టుకునేందుకు అంగీక‌రించాడ‌ట‌. ఇక త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనూ చాలా ఖ‌ర్చు పెట్టాల్సి వ‌చ్చిందట. పార్టీ ఫండ్ గా కూడా భారీగానే స‌మ‌ర్పించుకోవాల్సి వ‌చ్చింద‌ట‌.

ఏతావాతా ఆయ‌నకి అక్ష‌రాలా 100 కోట్లు ఖ‌ర్చు అయిందనేది టాక్‌. కానీ ఆనంద్ ప్రసాద్ ఎలక్షన్స్ లో ఘోరంగా ఓడిపోయాడు. అంటే సినిమాల్లో కూడా ఎప్పుడూ ఎక్కువగా నష్టపోని ఆనంద్ ప్రసాద్ ఇక్కడ మాత్రం ఏకంగా వంద కోట్లు నష్టపోయాడని సినీ వర్గాలలో బాగా చర్చ నడుస్తోంది.

Tags:    
Advertisement

Similar News