కేటీఆర్ కోటరీ అప్పుడే తయారైందా?
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ సోమవారం బాధ్యతలు స్వీకరించబోతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పేరు ప్రకటించి రెండు రోజులు మాత్రమే అయింది. కానీ ఆయన చుట్టూ నలుగురే నలుగురు నేతలు కన్పిస్తున్నారు. వారే అంతా హడావుడి చేస్తున్నారు. దీంతో కేటీఆర్‌కు అప్పుడే కోటరీ తయారైందని గుసగుసలు విన్పిస్తున్నాయి. కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకటించినప్పటి నుంచి ఆయన పక్కనే హైదరాబాద్ మేయర్ బొంతు రాంమ్మోహన్ కనిపిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కూడా కేటీఆర్ పక్కన ఆయనే హడావుడి […]
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ సోమవారం బాధ్యతలు స్వీకరించబోతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పేరు ప్రకటించి రెండు రోజులు మాత్రమే అయింది. కానీ ఆయన చుట్టూ నలుగురే నలుగురు నేతలు కన్పిస్తున్నారు. వారే అంతా హడావుడి చేస్తున్నారు. దీంతో కేటీఆర్‌కు అప్పుడే కోటరీ తయారైందని గుసగుసలు విన్పిస్తున్నాయి.
కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకటించినప్పటి నుంచి ఆయన పక్కనే హైదరాబాద్ మేయర్ బొంతు రాంమ్మోహన్ కనిపిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కూడా కేటీఆర్ పక్కన ఆయనే హడావుడి చేశారు. ఇప్పుడు కేటీఆర్ కోటరీలో ఆయన ముఖ్యమైన మెంబర్‌గా మారారు.
బొంతు రాంమ్మోహన్ తర్వాత చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కేటీఆర్‌కు దగ్గరగా ఉంటున్నారు. చాలా రోజులుగా ఆయన కేటీఆర్ వెంటే ఉంటున్నారు. అయితే విద్యార్థి రాజకీయాల్లో తిరిగిన ఇతర నేతలతో పాటు ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి సంఘం నేతలు కేటీఆర్‌కు దగ్గర కాకుండా ఈయన ప్రయత్నిస్తున్నారని అప్పుడే విమర్శలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ దగ్గర మరో నేత మార్కులు కొట్టేయకుండా ఈయన ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు.
ఈ ఇద్దరు నేతలే కాదు. తాజాగా మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కేటీఆర్ వెంటే తిరుగుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇతర నేతలను కలవడానికి వెళ్లినపుడు ఈ ఇద్దరు నేతలు కనిపించారు. ఆ తర్వాత రోజు కూడా ఈ ఇద్దరు ఆయనతో పాటు తిరగడం టీవీల్లోకనిపించింది. మంత్రి పదవుల కోసం ఈ ఇద్దరు నేతలు కేటీఆర్ జపం చేస్తున్నారనేది ఓటాపిక్.
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా కేటీఆర్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు ముఖ్య నేతలు కేటీఆర్ కోటరీలో భాగంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కేటీఆర్ కోటరీ అప్పుడే పార్టీలో చర్చనీయాంశంగా మారింది.