ప్రసాదం తిని 12 మంది మృతి.... విషం కలిపింది వారే....
కర్నాటకలో ఘోరం జరిగింది. దేవుడి ప్రసాదం తిని 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. చామరాజనగర్ జిల్లా సుళివాడి గ్రామంలో అమ్మవారి ఆలయానికి గోపుర నిర్మాణం కోసం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. పూజ ముగిసిన తర్వాత భక్తులకు ప్రసాదంగా రైస్ బాత్ అందజేశారు. దాన్ని తిన్న వెంటనే భక్తులు వాంతులు […]
కర్నాటకలో ఘోరం జరిగింది. దేవుడి ప్రసాదం తిని 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. చామరాజనగర్ జిల్లా సుళివాడి గ్రామంలో అమ్మవారి ఆలయానికి గోపుర నిర్మాణం కోసం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చారు.
పూజ ముగిసిన తర్వాత భక్తులకు ప్రసాదంగా రైస్ బాత్ అందజేశారు. దాన్ని తిన్న వెంటనే భక్తులు వాంతులు చేసుకున్నారు. సృహతప్పి పడిపోయారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా… చికిత్స పొందుతూ 12 మంది చనిపోయారు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.
ప్రసాదం ఇలా విషపూరితం అవడానికి ఆలయంలోని రెండు వర్గాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరు ముదిరి… ప్రసాద కార్యక్రమాలు చూసిన ఒకవర్గం వారికి చెడ్డపేరు రావాలన్న ఉద్దేశంతో ప్రసాదంలో కిరోసిన్, క్రిమిసంహారక మందు కలిపినట్టు భావిస్తున్నారు.
ప్రసాదాన్ని పరీక్షలకు పంపించారు. ఆలయ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారంగా ప్రకటించింది.