అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌ యువకుడు మృతి

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన;

Advertisement
Update:2024-11-19 22:10 IST
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌ యువకుడు మృతి
  • whatsapp icon

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన రాం ఆశీష్‌ కుటుంబం కుత్బుల్లాపూర్‌ డివిజన్‌లోని పద్మానగర్‌ ఫేజ్‌-2లో నివాసం ఉంటున్నది. రాం ఆశీష్‌కు ఇద్దరు కుమారులు. వారిలో చిన్న కొడుకు,  రెండేళ్ల కిందట ఎమ్మెస్‌ చేయడానికి అమెరికాలోని ఒహాయో వెళ్లాడు. ఈ నెల 17న (భారత కాలమానం ప్రకారం) రాత్రి తన స్నేహితుడితో కలిసి మరో స్నేహితుడిని కలవడానికి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో వీరికి ఎదురుగా వచ్చిన మరో కారు వేగంగా ఢీ కొట్టడంతో సందీప్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని స్నేహితుడు స్వల్ప గాయాలతో బైటపడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీటి పర్వంతమయ్యారు. తమ కుమారుడి మృతదేహాన్ని హైదరాబాద్‌ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాల్సిందిగా వేడుకుంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News