నీలోఫర్లో చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతం
ఆరు గంటల వ్యవధిలో పసికందు ఆచూకీ కనిపెటిన నాంపల్లి పోలీసులు
Advertisement
నీలోఫర్ హాస్పిటల్ కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. నాంపల్లి పోలీసులు ఆరు గంటల వ్యవధిలో పసికందు ఆచూకీ కనిపెట్టారు. కర్నూల్ లో నిందితురాలితో పాటు మరో ఇద్దరని అదుపులోకి తీసుకున్నారు. జహీరాబాద్క చెందిన హసీనా బేగం- గఫార్ దంపతులు బాబు జన్మించాడు. చిన్నారికి కామెర్లు రావడంతో తల్లితో కలిసి నీలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చింది. చికిత్స పొందుతున్నచిన్నారి వద్దకు హాస్పిటల్ సిబ్బంది పేరు చెప్పి హసీనా తల్లి వద్ద నుంచి గుర్తు తెలియని మహిళ బాలుడిని ఎత్తుకెళ్లింది. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిడ్నాప్ కేసును ఛేదించారు. అంతకుముందు నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ పరామర్శించారు. ఇవాళ మీడియా సమావేశం అనంతరం చిన్నారిని అప్పగించనున్నారు.
Advertisement