కేసీఆర్ ఆదేశాలతోనే నన్ను ఓడించారు....

ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో రీకౌంటింగ్ నిర్వహించాల్సిందిగా పట్టుపడుతున్నారు కాంగ్రెస్ మద్దతుతో బీఎస్పీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మల్ రెడ్డి రంగారెడ్డి. ఈ మేరకు సీఈవో రజత్‌ కుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తనకు పడ్డ ఓట్లను కావాలనే లెక్కించలేదన్నారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు వ్యవహరించారని ఆరోపించారు. 18వ రౌండ్ నుంచి తన మెజార్టీని తగ్గిస్తూ వచ్చారన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కుమారుడు సెల్‌ఫోన్‌తో కౌంటింగ్ హాల్‌లోకి వచ్చారని […]

Advertisement
Update:2018-12-14 11:08 IST

ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో రీకౌంటింగ్ నిర్వహించాల్సిందిగా పట్టుపడుతున్నారు కాంగ్రెస్ మద్దతుతో బీఎస్పీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మల్ రెడ్డి రంగారెడ్డి.

ఈ మేరకు సీఈవో రజత్‌ కుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

తనకు పడ్డ ఓట్లను కావాలనే లెక్కించలేదన్నారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు వ్యవహరించారని ఆరోపించారు. 18వ రౌండ్ నుంచి తన మెజార్టీని తగ్గిస్తూ వచ్చారన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కుమారుడు సెల్‌ఫోన్‌తో కౌంటింగ్ హాల్‌లోకి వచ్చారని వెల్లడించారు.

ఎన్నికల కమిషన్‌ న్యాయం చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తానన్నారు. తనలాగే కౌంటింగ్ లో అక్రమాల వల్ల స్వల్ప తేడాతో ఓడిపోయిన వారిని కలుపుకుని పోరాటం చేస్తానని చెప్పారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారాన్ని నిలిపివేయాలని మల్ రెడ్డి డిమాండ్ చేశారు.

మహాకూటమి పొత్తులో భాగంగా ఇబ్రహీంపట్నం టికెట్‌ను టీడీపికి కేటాయించింది. టీడీపీ నుంచి సామా రంగారెడ్డి పోటీ చేశారు. దాంతో మల్ రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ తరపున బరిలో దిగారు. అక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం లేకపోవడంతో ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ మల్‌ రెడ్డి రంగారెడ్డికే మద్దతు ప్రకటించింది. దీంతో గెలుపు అంచుల వరకు వచ్చిన మల్ రెడ్డి రంగారెడ్డి ఆఖరి రౌండ్లలో వెనుకబడి కేవలం 376 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

Tags:    
Advertisement

Similar News