నెంబర్ 2గా కేటీఆర్? ట‌్రబుల్ షూటర్ సంగతేంటి?
గులాబీ దళంలో వారసత్వ పోరుకు ముగింపు పలికేందుకు కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 90 సీట్లతో టీఆర్ఎస్ ఎదురులేని శక్తిగా తయారైన నేపథ్యంలో …. కేటీఆర్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. అయితే ఇన్నాళ్లు పార్టీలో ఉన్న ట్రబుల్ షూటర్ హరీష్‌రావు పరిస్థితేంటి? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్ దగ్గరకు అప్పుడే నేతలు క్యూ కట్టారు. అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇదే టైమ్‌లో హరీష్‌రావు కూడా స్పందించారు. కేటీఆర్‌కు శుభాకాంక్షలు […]
గులాబీ దళంలో వారసత్వ పోరుకు ముగింపు పలికేందుకు కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 90 సీట్లతో టీఆర్ఎస్ ఎదురులేని శక్తిగా తయారైన నేపథ్యంలో …. కేటీఆర్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. అయితే ఇన్నాళ్లు పార్టీలో ఉన్న ట్రబుల్ షూటర్ హరీష్‌రావు పరిస్థితేంటి? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్ దగ్గరకు అప్పుడే నేతలు క్యూ కట్టారు. అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇదే టైమ్‌లో హరీష్‌రావు కూడా స్పందించారు. కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. థ్యాంక్స్ బావా అంటూ కేటీఆర్ కూడా రిప్లై ఇచ్చారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. కేటీఆర్‌కు పదవి ఇవ్వడంపై హరీష్‌రావు అభ్యంతరం లేదని తన ట్వీట్ ద్వారా తెలియజేయడానికి ట్రై చేశారు.
కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌ను చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో…. మరి హరీష్ పరిస్థితేంటన్న చర్చ ఇప్పుడు తెర పైకి వచ్చింది. కేసీఆర్ తర్వాత ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్, అంతటి సమర్థత కలిగిన హరీశ్ రావు కేటీఆర్ నీడలో పనిచేస్తారా? అనేది ఓ ప్రశ్న. అయితే ముందుముందు జరగబోయే పరిణామాలే దీనికి సమాధానం చెబుతాయనేది పార్టీలో నేతలు చెబుతున్నారు.
హరీశ్ రావు ప్రాధాన్యం తగ్గించకుండా కేసీఆర్ ఆయన్ను తన వెంటే జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రత్యామ్నాయం కోసం దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలని భావిస్తున్న కేసీఆర్…. ఆ క్రమంలో హరీష్ ను తన వెంటే ఢిల్లీకి తీసుకెళ్లబోతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో ఎలాగైతే ట్రబుల్ షూటర్‌గా పనిచేశాడో.. రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లోనూ ఆయన్ను ట్రబుల్ షూటర్‌గా మార్చాలనేది కేసీఆర్ ప్లాన్‌గా తెలుస్తోంది. అదే జరిగితే జాతీయ స్థాయి నేతగా ఆయనకు మంచి గుర్తింపు వస్తుందని.. తద్వారా పార్టీలో ఆయన ప్రాధాన్యం తగ్గించారన్న ప్రస్తావనకు తావు ఉండదని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
ఇటు మంత్రివర్గంలో కూడా హరీష్‌రావుకి ఏ శాఖ కేటాయిస్తారనేది కూడా కీలకంగా మారింది. శాసనసభ వ్యవహారాలు ఇస్తారా? లేదా? అనేది ఓ డౌట్. అంతేకాకుండా కీలకమైన సాగునీటిశాఖ ఇచ్చి కూల్ చేస్తారా? అనేది చూడాలి.