ఆయనకు ఆర్ధికమంత్రి పదవి... మరి ఈటెలకు ?
తెలంగాణ మంత్రి వర్గంలో ఇప్పుడు ఎవరెవరికి చోటు కల్పిస్తారు అనేది హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్‌తో కలుపుకుని 18 మందికి చోటు ఉంది. అయితే ఇప్పటికే ఇద్దరు ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్‌తో పాటు మహమూద్ అలీ మంత్రివర్గంలో ఉన్నారు. మహమూద్ అలీకి హోంశాఖ కేటాయించారు. గతంలో హోంమంత్రిగా ఉన్న నాయిని నరసింహారెడ్డికి ఇప్పుడు బెర్త్ దక్కుతుందా? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. ముషీరాబాద్ సీటు కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. తన అల్లుడికి టికెట్ […]
తెలంగాణ మంత్రి వర్గంలో ఇప్పుడు ఎవరెవరికి చోటు కల్పిస్తారు అనేది హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్‌తో కలుపుకుని 18 మందికి చోటు ఉంది. అయితే ఇప్పటికే ఇద్దరు ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్‌తో పాటు మహమూద్ అలీ మంత్రివర్గంలో ఉన్నారు. మహమూద్ అలీకి హోంశాఖ కేటాయించారు.
గతంలో హోంమంత్రిగా ఉన్న నాయిని నరసింహారెడ్డికి ఇప్పుడు బెర్త్ దక్కుతుందా? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. ముషీరాబాద్ సీటు కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. తన అల్లుడికి టికెట్ కోసం కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపినట్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఆయనకు ఈ సారి మంత్రి పదవి కష్టమేనని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఆయనకు ఇస్తే కార్మిక శాఖ ఇవ్వొచ్చని అంటున్నారు. నాయిని స్థానంలో మేడ్చల్ మల్లారెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి.
ఇక రెండో కీలకమైన పోర్ట్ పోలియో… ఆర్ధిక శాఖ. ఈటెల రాజేందర్ ఇప్పటిదాకా ఈ బాధ్యతలు చూశారు. అయితే ఆయన శాఖ మారుస్తారని ప్రచారం మాత్రం నడుస్తోంది. ఆయన్ని స్పీకర్‌గా పంపిస్తారని తెలుస్తోంది. ఒకవేళ ఆయన స్పీకర్‌గా వెళ్లేందుకు నిరాకరిస్తే ప్రాధాన్యం లేని శాఖ ఇస్తారని తెలుస్తోంది. ఆర్థికశాఖ మంత్రిగా ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న నిరంజన్‌రెడ్డికి ఈ పదవి దక్కే చాన్స్ ఉంది. వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన నిరంజన్ రెడ్డి కేసీఆర్‌కి దగ్గరి మనిషి. అంతేకాకుండా కేటీఆర్‌కి కూడా నమ్మకమైన వ్యక్తి.
మరోవైపు వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు బెర్త్ దక్కితే… కడియంకు మంత్రి పదవి డౌటే. అంతేకాకుండా కేటీఆర్ టీమ్‌లో కీలక మెంబర్స్ బాల్కసుమన్, దాస్యం వినయ్ భాస్కర్, పువ్వాడ అజయ్, గొంగిడి సునీతలకు మంత్రి పదవులు వరించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఇప్పుడు మంత్రివర్గంలో సీనియర్లకు పెద్దపీటవేస్తారా? హరీష్‌రావు వర్గంగా పేరుపడ్డ నేతలను పక్కన పెడతారా? కేటీఆర్ టీమ్‌కు చాన్స్ ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.