రాహుల్‌, బాబు కాంబినేషన్‌పై కొత్త హెడ్‌లైన్‌ చూస్తారు " జీవీఎల్

బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు తనదైన శైలిలో స్పందించారు. ప్రతి పార్లమెంట్‌ సమావేశాలకు ముందు అన్ని పార్టీలు, వారి వారి భాగస్వామ్య పక్షాలతో ఇలాంటి సమావేశాలు నిర్వహించడం సహజమని… చంద్రబాబు మాత్రం అలాంటి మీటింగ్‌ను కూడా తానే ఆర్గనైజ్ చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గల్లీ అవార్డులను కూడా గ్లోబల్ అవార్డులు అని ప్రచారం చేసుకునే చంద్రబాబు… తనకు తాను భ్రమిస్తూ… ఇతరపార్టీల చుట్టూ తిరుగుతూ…. […]

Advertisement
Update:2018-12-10 06:14 IST

బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు తనదైన శైలిలో స్పందించారు. ప్రతి పార్లమెంట్‌ సమావేశాలకు ముందు అన్ని పార్టీలు, వారి వారి భాగస్వామ్య పక్షాలతో ఇలాంటి సమావేశాలు నిర్వహించడం సహజమని… చంద్రబాబు మాత్రం అలాంటి మీటింగ్‌ను కూడా తానే ఆర్గనైజ్ చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

గల్లీ అవార్డులను కూడా గ్లోబల్ అవార్డులు అని ప్రచారం చేసుకునే చంద్రబాబు… తనకు తాను భ్రమిస్తూ… ఇతరపార్టీల చుట్టూ తిరుగుతూ…. ప్రజలను భ్రమల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో కో ఆర్డినేషన్‌ కోసం ప్రతిపక్ష పార్టీల సమావేశం ప్రతిసారి సహజంగా జరిగేదేనన్నారు.

చంద్రబాబు చక్రం తిప్పుతున్నట్టు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ, ఏ నేత చెప్పడం లేదని… కేవలం ఏపీలో మాత్రమే చంద్రబాబు ఏదో చక్రం తిప్పుతున్నారంటూ మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారని జీవీఎల్ వ్యాఖ్యానించారు. సమావేశమవుతున్న ప్రతిపక్ష పార్టీలన్నీ చాలాకాలంగానే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని… వారి పంచన చంద్రబాబే ఆలస్యంగా చేరి… వారందరినీ ఏకం చేస్తున్నా అని చెప్పుకోవడం విచిత్రంగా ఉందన్నారు. ఏపార్టీ చంద్రబాబు వద్దకు రాలేదని… చంద్రబాబే వారి వద్దకు వెళ్లి చక్రం తిప్పుతా అంటూ బతిమలాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

నెల క్రితంతో పోలిస్తే చంద్రబాబు గ్రాఫ్ ఇంకా క్షీణించిందన్నారు. ఇప్పటి వరకు రాహుల్‌తో పొత్తు పెట్టుకుని డీఎంకే, ఎస్పీ, వామపక్షాలు నష్టపోయాయని… తెలంగాణ ఎన్నికల తర్వాత చంద్రబాబుతో పొత్తుపెట్టుకుని దెబ్బతినిపోయిన రాహుల్ అంటూ కొత్త హెడ్‌లైన్ చూస్తారని జీవీఎల్ వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News