కేసీఆర్ ఇంటికి రహస్యంగా బుల్లెట్ పై అసదుద్దీన్.... ఎందుకలా...?

అసదుద్దీన్ ఓవైసీ ఆశ్చర్యపరిచాడు. ఒంటరిగా ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి హెల్మెట్ పెట్టుకొని ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఓ బుల్లెట్ పై కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ కు వచ్చాడు. ఎవరికీ కనిపించకుండా రహస్యంగా అసదుద్దీన్ రావడం మీడియా కంట పడింది. ఎప్పుడు మాందీ, మార్బలంతో వచ్చే అసదుద్దీన్ ఇలా ఒక్కడే రహస్యంగా రావడంపై అంతా చర్చించుకుంటున్నారు. కనీసం తన తమ్ముడు…. ఎంఐఎం శాసన సభ పక్ష నేత అక్బరుద్దీన్ ను కూడా వెంట తెచ్చుకోకపోవడం ఆసక్తి […]

Advertisement
Update:2018-12-10 10:36 IST

అసదుద్దీన్ ఓవైసీ ఆశ్చర్యపరిచాడు. ఒంటరిగా ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి హెల్మెట్ పెట్టుకొని ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఓ బుల్లెట్ పై కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ కు వచ్చాడు. ఎవరికీ కనిపించకుండా రహస్యంగా అసదుద్దీన్ రావడం మీడియా కంట పడింది. ఎప్పుడు మాందీ, మార్బలంతో వచ్చే అసదుద్దీన్ ఇలా ఒక్కడే రహస్యంగా రావడంపై అంతా చర్చించుకుంటున్నారు. కనీసం తన తమ్ముడు…. ఎంఐఎం శాసన సభ పక్ష నేత అక్బరుద్దీన్ ను కూడా వెంట తెచ్చుకోకపోవడం ఆసక్తి రేపుతోంది.

ఈ మధ్య కాలంలో అన్నాదమ్ములు అసదుద్దీన్, అక్బరుద్దీన్ లు చేరో మాట మాట్లాడుతున్నారు. అసద్ సీఎం కేసీఆర్ కు బహిరంగ మద్దతు ప్రకటించి ఆయన వెంట నడుస్తుండగా.. అక్బరుద్దీన్ మాత్రం హంగ్ వస్తే తనే సీఎం అంటూ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి అన్నాదమ్ముల మధ్య సఖ్యత లేదనే వార్తలొచ్చాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు వేళ అయింది. ఈ నేపథ్యంలోనే హంగ్ ఏర్పడితే ఎంఐఎం మద్దతు కీలకంగా మారింది. దీంతో నిన్న కేసీఆర్ కు ఫోన్ చేసిన అసదుద్దీన్…. తాజాగా సోమవారం మధ్యాహ్నం అసదుద్దీన్ ఒక్కడే ప్రగతి భవన్ కు వచ్చాడు. పోలీసులు ఆయన్ను లోపలికి సాదరంగా ఆహ్వానించారు. తాజా రాజకీయాలు, హంగ్ వస్తే మద్దతుపై చర్చించేందుకు కేసీఆర్ తో లంచ్ కు అసదుద్దీన్ వచ్చినట్టు సమాచారం.

కేసీఆర్ తో అసద్ రహస్య సమావేశం నిర్వహించారు. అంతకుముందు అసదుద్దీన్ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ మరోసారి సీఎం కావాలని తాము కోరుకుంటున్నామని…. అల్లా దయ వల్ల ఆయన సొంతంగా మెజార్టీ తెచ్చుకోవాలని…. లేకపోయినా తమ మద్దతు టీఆర్ఎస్ కేనని ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News