నర్సంపేటలో 84%.. యాకుత్‌పురలో 33%.. 

తెలంగాణ ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఒక పెద్ద అంకం శుక్రవారం పూర్తయ్యింది. చెదురు మదురు సంఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి రజత్ కుమార్ తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ 67.70  శాతంగా నమోదయినట్లు ఆయన చెప్పారు. నర్సంపేట నియోజకవర్గంలో అత్యధికంగా 84 శాతం ఓటింగ్ నమోదవ్వగా.. అత్యల్పంగా పాతబస్తీలోని యాకుత్‌పుర నియోజకవర్గంలో 33 శాతం ఓటింగ్ జరిగిందన్నారు. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, సమస్యాత్మక నియోజకవర్గాలుగా […]

Advertisement
Update: 2018-12-07 22:32 GMT

తెలంగాణ ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఒక పెద్ద అంకం శుక్రవారం పూర్తయ్యింది. చెదురు మదురు సంఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి రజత్ కుమార్ తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ 67.70 శాతంగా నమోదయినట్లు ఆయన చెప్పారు.

నర్సంపేట నియోజకవర్గంలో అత్యధికంగా 84 శాతం ఓటింగ్ నమోదవ్వగా.. అత్యల్పంగా పాతబస్తీలోని యాకుత్‌పుర నియోజకవర్గంలో 33 శాతం ఓటింగ్ జరిగిందన్నారు. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించిన 13 అసెంబ్లీ స్థానాల్లో 74 శాతం ఓటింగ్ నమోదయినట్లు ఆయన స్పష్టం చేశారు.

పెదవూర మండలంలోని ఒక పోలింగ్ కేంద్రంలో సాయంత్రం 5 గంటలకు క్యూలో ఉన్న వారందరి చేత ఓటింగ్ వేయించే సరికి రాత్రి 8 అయ్యిందన్నారు. ఇక మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలం తిమ్మాపురం గ్రామ ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించారని.. అక్కడి పోలింగ్ కేంద్ర సిబ్బంది ఈ విషయం తెలియజేశారని ఆయన చెప్పారు.

ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కంట్రోల్ యూనిట్, ఈవీఎంలను పటిష్ట భద్రత నడుమ ఉంచారు.

Tags:    
Advertisement

Similar News