వేదికపై కుప్పకూలిన కేంద్ర మంత్రి గడ్కరి

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి శుక్రవారం ఒక కార్యక్రమంలో వేదికపైనే కుప్పకూలారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని అహ్మెద్‌నగర్‌లో మహాత్మ పూలే క్రిషి విద్యాపీఠ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కాన్వకేషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ సహా, నితిన్ గడ్కరి హాజరయ్యారు. కాన్వకేషన్ కార్యక్రమం ముగింపులో జాతీయ గీతం ఆలపిస్తుండగా అందరూ లేచి నిల్చున్నారు. అదే సమయంలో నితిన్ గడ్కరి ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. దీంతో అక్కడే ఉన్నా గవర్నర్ విద్యాసాగర్‌రావు భద్రతా సిబ్బంది ఆయనను […]

Advertisement
Update:2018-12-08 03:28 IST

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి శుక్రవారం ఒక కార్యక్రమంలో వేదికపైనే కుప్పకూలారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని అహ్మెద్‌నగర్‌లో మహాత్మ పూలే క్రిషి విద్యాపీఠ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కాన్వకేషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ సహా, నితిన్ గడ్కరి హాజరయ్యారు.

కాన్వకేషన్ కార్యక్రమం ముగింపులో జాతీయ గీతం ఆలపిస్తుండగా అందరూ లేచి నిల్చున్నారు. అదే సమయంలో నితిన్ గడ్కరి ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. దీంతో అక్కడే ఉన్నా గవర్నర్ విద్యాసాగర్‌రావు భద్రతా సిబ్బంది ఆయనను తీసుకొని పక్కకు తీసుకొని వెళ్లారు. అక్కడకు చేరుకున్న డాక్టర్ ఆయనకు పూర్తి వైద్యపరీక్షలు చేసి ఆక్సిజన్ అందకపోవడం వల్లే ఊపిరాడక కుప్పకూలినట్లు తేల్చారు.

అనంతరం కాస్త కోలుకున్న గడ్కరి తాను క్షేమంగా ఉన్నట్లు ట్వీట్ చేశారు. ఊపిరి సరిగా ఆడకపోవడం, లో బ్లడ్ షుగర్ వల్లే తనకు అలా జరిగిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News