వంశీచంద్‌ రెడ్డిపై దాడి... ఆస్పత్రికి తరలింపు

కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డిపై దాడి జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్‌ మండలం జంగారెడ్డిపల్లిలో ఈ దాడి జరిగింది. కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వడంతో ఈ ఘటన జరిగింది. పోలింగ్ బూత్‌ను పరిశీలించేందుకు వంశీచంద్‌ వెళ్లిన సమయంలో కొందరు రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో వంశీచంద్‌ రెడ్డి గాయపడగా ఆయన్ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. బీజేపీ కార్యకర్తలే వంశీపై దాడి చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అటు కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో టీడీపీ- టీఆర్‌ఎస్ […]

Advertisement
Update: 2018-12-07 00:34 GMT

కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డిపై దాడి జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్‌ మండలం జంగారెడ్డిపల్లిలో ఈ దాడి జరిగింది.

కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వడంతో ఈ ఘటన జరిగింది. పోలింగ్ బూత్‌ను పరిశీలించేందుకు వంశీచంద్‌ వెళ్లిన సమయంలో కొందరు రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో వంశీచంద్‌ రెడ్డి గాయపడగా ఆయన్ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. బీజేపీ కార్యకర్తలే వంశీపై దాడి చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

అటు కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో టీడీపీ- టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు గొడవపడుతున్న వారిని చెదరగొట్టారు. కాంగ్రెస్‌ నేతలపై దాడిని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఖండించారు. మహాకూటమి నేతలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆయన ఆందోళన చెందారు. వెంటనే ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags:    
Advertisement

Similar News