అడిలైడ్ టెస్ట్ తొలిరోజునే టీమిండియా ఎదురీత

9 వికెట్లకు 250 పరుగుల టీమిండియా  ఫైటింగ్ సెంచరీతో పరువు నిలిపిన చతేశ్వర్ పూజారా 3 పరుగుల స్కోరుకే విరాట్ కొహ్లీ ప్యాకప్ ఆస్ట్రేలియాతో నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను…టాప్ ర్యాంకర్ టీమిండియా తడబాటుతో మొదలుపెట్టింది. అడిలైడ్ ఓవల్ వేదికగా ప్రారంభమైన తొలిటెస్ట్ తొలిరోజు ఆటను…9 వికెట్లకు 250 పరుగుల స్కోరుతో ముగించింది. ఈ మ్యాచ్ లో కీలక టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న టీమిండియా… 86 పరుగులకే 5 టాపార్డర్ వికెట్లు నష్టపోయి ఎదురీత […]

Advertisement
Update:2018-12-06 10:25 IST
  • 9 వికెట్లకు 250 పరుగుల టీమిండియా
  • ఫైటింగ్ సెంచరీతో పరువు నిలిపిన చతేశ్వర్ పూజారా
  • 3 పరుగుల స్కోరుకే విరాట్ కొహ్లీ ప్యాకప్

ఆస్ట్రేలియాతో నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను…టాప్ ర్యాంకర్ టీమిండియా తడబాటుతో మొదలుపెట్టింది. అడిలైడ్ ఓవల్ వేదికగా ప్రారంభమైన తొలిటెస్ట్ తొలిరోజు ఆటను…9 వికెట్లకు 250 పరుగుల స్కోరుతో ముగించింది.

ఈ మ్యాచ్ లో కీలక టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న టీమిండియా… 86 పరుగులకే 5 టాపార్డర్ వికెట్లు నష్టపోయి ఎదురీత ప్రారంభించింది.

ఓపెనర్లు రాహుల్ 2, విజయ్ 11, కెప్టెన్ విరాట్ కొహ్లీ 3, రహానే 13, రోహిత్ శర్మ 37 పరుగుల స్కోర్లకు వెనుదిరిగారు. అయితే ..వన్ డౌన్ ఆటగాడు చతేశ్వర్ పూజారా మాత్రం..ఒంటరిపోరాటం చేసి… ఫైటింగ్ సెంచరీతో ..టీమిండియాకు 250 పరుగుల స్కోరు అందించాడు.

పూజారా మొత్తం 246 బాల్స్ ఎదుర్కొని 7 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 123 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

లోయర్ ఆర్డర్లో రిషభ్ పంత్ 25, అశ్విన్ 25 పరుగుల చొప్పున సాధించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ల త్రయం స్టార్క్, కమ్మిన్స్, హేజిల్ వుడ్ తలో రెండు వికెట్లు, ఆఫ్ స్పిన్నర్ నేథన్ లయన్ 2 వికెట్లు పడగొట్టారు.

వండర్ క్యాచ్…థండర్ రనౌట్…

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియాను….తొలిరోజు ఆటలోనే 5వ ర్యాంకర్ ఆస్ట్రేలియా బౌలర్లు కేవలం 250 పరుగులకే కట్టడి చేశారు. బ్యాటింగ్ కు అనువుగా ఉన్న వికెట్ పై టాస్ నెగ్గి… .ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్నా…విరాట్ సేన అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది.

కంగారూ ఫాస్ట్ బౌలర్ల త్రయం మిషెల్ స్టార్క్, జోష్ హేజిల్ వుడ్, పాట్ కమ్మిన్స్…ఓ వ్యూహం ప్రకారం బౌల్ చేస్తే…ఫీల్డింగ్ లో ఫీల్డర్లు కళ్లు చెదిరే క్యాచ్ తో పాటు…అద్భుతమైన రనౌట్ తో సత్తా చాటుకొన్నారు. డేంజర్ మ్యాన్ , టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ… కమ్మిన్స్ బౌలింగ్ లో.. .స్లిప్ ఫీల్డర్ ఉస్మాన్ క్వాజా పట్టిన సూపర్ డూపర్ క్యాచ్ కు దొరికిపోయాడు.

కేవలం 3 పరుగుల స్కోరుకే కొహ్లీ పెవీలియన్ దారి పట్టాడు. అంతేకాదు…. సెంచరీ హీరో చతేశ్వర్ పూజారా సైతం…కమ్మిన్స్ విసిరిన ఓ సూపర్ త్రోకు.. రనౌట్ గా దొరికిపోయాడు.

మొత్తం మీద తొలిరోజు ఆటలో…పూజారా ఫైటింగ్ సెంచరీతో పాటు…క్వాజా పట్టిన క్యాచ్, కమ్మిన్స్ త్రో రనౌట్….హైలైట్స్ గా నిలిచిపోతాయి.

Tags:    
Advertisement

Similar News