సీట్ల సంఖ్య చెప్పలేను.... సీఎం ఎవరన్నది అప్రస్తుతం
తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించడమే తమ ముందున్న లక్ష్యమని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. చంద్రబాబు తనను కలిసిన మొదటిసారి మోడీ, అమిత్ షా చేతిలో దేశం దాడికి గురవుతోందని బాధపడ్డారని రాహుల్ చెప్పారు. మోడీ ప్రభుత్వంలో సుప్రీం కోర్టు నుంచి సీబీఐ వరకు ప్రతి వ్యవస్థ దాడికి గురవుతోందన్నారు. మహాకూటమికి ఎన్నిసీట్లు వస్తాయన్న ప్రశ్నకు సమాధానం దాటవేసిన రాహుల్ గాంధీ… ప్రభుత్వం మాత్రం కూటమిదేనన్నారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది కాబట్టే… కేసీఆర్ […]
తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించడమే తమ ముందున్న లక్ష్యమని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. చంద్రబాబు తనను కలిసిన మొదటిసారి మోడీ, అమిత్ షా చేతిలో దేశం దాడికి గురవుతోందని బాధపడ్డారని రాహుల్ చెప్పారు. మోడీ ప్రభుత్వంలో సుప్రీం కోర్టు నుంచి సీబీఐ వరకు ప్రతి వ్యవస్థ దాడికి గురవుతోందన్నారు.
మహాకూటమికి ఎన్నిసీట్లు వస్తాయన్న ప్రశ్నకు సమాధానం దాటవేసిన రాహుల్ గాంధీ… ప్రభుత్వం మాత్రం కూటమిదేనన్నారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది కాబట్టే… కేసీఆర్ వ్యవహారశైలిలో అసహనం కనిపిస్తోందన్నారు.
టీడీపీతో కాంగ్రెస్ పొత్తును ప్రజలే అర్థం చేసుకున్నారని… దాని గురించి ప్రజలను ప్రత్యేకంగా ఒప్పించాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్‌ను దించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. కూటమి తరపున సీఎం అభ్యర్థి ఎవరన్నది ఇప్పుడు అప్రస్తుతమన్నారు రాహుల్.
దేశ రాజకీయాల్లో మార్పుకు తెలంగాణ ఎన్నికలే పునాది అవుతాయన్నారు. ఎన్నికల ప్రచారం ముగియడానికి ముందు రాహుల్, చంద్రబాబు, కోదండరాం కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈసీ నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రచారం గడువు ముగిసే ఆఖరి నిమిషం వరకు ప్రెస్‌మీట్ నిర్వహించారు.