తెలంగాణలో ఓడిపోతే.... ఆంధ్రలో కష్టమే!
తెలంగాణ ఎన్నికల్లో హోరా హోరీగా ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ కు ధీటుగా ప్రజాకూటమి కూడా పోరాడుతోంది. గెలుపు ఎవరిది అన్నది అటుంచితే ప్రజాకూటమి తరపున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో ప్రచారం చేయడం వల్ల అటు కాంగ్రెస్‌కు, ఇటు తెలుగుదేశం పార్టీకి ఒనగూరే ప్రయోజనం ఏమేరకు ఉంటుందనేది అన్ని స్థాయిల్లోనూ భయం పట్టుకుంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నిలిచింది. అయితే ఎదిగే క్రమంలో కాంగ్రెస్, చంద్రబాబు జత కట్టడం వల్ల పరిస్థితులు తారుమారు […]
తెలంగాణ ఎన్నికల్లో హోరా హోరీగా ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ కు ధీటుగా ప్రజాకూటమి కూడా పోరాడుతోంది. గెలుపు ఎవరిది అన్నది అటుంచితే ప్రజాకూటమి తరపున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో ప్రచారం చేయడం వల్ల అటు కాంగ్రెస్‌కు, ఇటు తెలుగుదేశం పార్టీకి ఒనగూరే ప్రయోజనం ఏమేరకు ఉంటుందనేది అన్ని స్థాయిల్లోనూ భయం పట్టుకుంది.
తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నిలిచింది. అయితే ఎదిగే క్రమంలో కాంగ్రెస్, చంద్రబాబు జత కట్టడం వల్ల పరిస్థితులు తారుమారు అవుతున్నాయన్న భయం పట్టుకుంది. ఒకవైపు రాహుల్ గాంధీని, మరోవైపు చంద్రబాబును ఎన్నికల ప్రచారంలోకి దింపడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమేరకు అన్నది ఇపుడు కాంగ్రెస్ అంచనా వేస్తోంది. చంద్రబాబువల్ల మేలుకంటే కీడే ఎక్కువ జరుగుతుందని భావిస్తున్నారు.
తెలంగాణ ప్రజల్లో ఇంకా సెంటిమెంట్ బలంగానే ఉంది. చంద్రబాబు మళ్ళీ హైదరాబాద్ వచ్చి పెత్తనం చేయడం ఏమిటి? అన్న అంశాన్ని టీఆర్ఎస్ తెరమీదకు తీసుకొస్తోంది. చంద్రబాబు కూడా నేను తెలంగాణకు సీఎంను అవ్వను అంటున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రచారం చేసినందువల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్….కాబట్టి. కానీ చంద్రబాబు విషయంలో తెలంగాణ ప్రజలు ఇంకా ఆగ్రహంగానే ఉన్నారు. దీంతో చంద్రబాబు వల్ల ప్రజాకూటమికి నష్టమే జరుగుతుందని భావిస్తున్నారు.
మరో వైపు తెలుగుదేశం పార్టీలోనూ గుబులు నెలకొంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ కు అనుకూలంగా వస్తే… 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా చంద్రబాబు విపత్కర పరిస్థితినే ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం పట్టుకుంది.
తెలంగాణలో వెనకా ముందూ ఆలోచించకుండా మాట్లాడుతున్న చంద్రబాబు అక్కడ వచ్చే ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన కూడా ఉంటుందని అంచనా వేయడంలో వెనకబడ్డారు. తెలంగాణలో గెలిచినా, ఓడినా టీడీపీకి పోయేదేమీ లేదు. కానీ అక్కడ ఓడిపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో చాలా కోల్పోవాల్సి వస్తుందనే భయం తెలుగు తమ్ముళ్లకు పట్టుకుంది.