జనసేనకు భారీ షాక్... విజయ్‌ బాబు రాజీనామా

జనసేనకు భారీ షాక్ తగిలింది. జనసేనను నైతికంగా దెబ్బతీసే పరిణామం చోటు చేసుకుంది. జనసేన పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్న విజయ్‌బాబు రాజీనామా చేశారు. జర్నలిస్టుగా, రచయితగా, ఆంధ్రప్రభ ఎడిటర్ గా, సమాచారహక్కు చట్టం కమిషనర్‌గా పనిచేసిన విజయ్‌బాబుకు రాజకీయ అంశాలపై అపారమైన పట్టు ఉంది. మంచి వ్యూహకర్తగా కూడా పేరుంది. కొన్ని నెలల క్రితమే ఆయన జనసేనలో చేరారు. ఇంతలోనే విజయ్‌బాబు రాజీనామా చేయడం జనసేన శ్రేణులను షాక్‌కు గురిచేసింది. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా […]

Advertisement
Update:2018-12-02 05:57 IST

జనసేనకు భారీ షాక్ తగిలింది. జనసేనను నైతికంగా దెబ్బతీసే పరిణామం చోటు చేసుకుంది. జనసేన పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్న విజయ్‌బాబు రాజీనామా చేశారు. జర్నలిస్టుగా, రచయితగా, ఆంధ్రప్రభ ఎడిటర్ గా, సమాచారహక్కు చట్టం కమిషనర్‌గా పనిచేసిన విజయ్‌బాబుకు రాజకీయ అంశాలపై అపారమైన పట్టు ఉంది.

మంచి వ్యూహకర్తగా కూడా పేరుంది. కొన్ని నెలల క్రితమే ఆయన జనసేనలో చేరారు. ఇంతలోనే విజయ్‌బాబు రాజీనామా చేయడం జనసేన శ్రేణులను షాక్‌కు గురిచేసింది. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేశానని విజయ్‌బాబు వెల్లడించారు.

వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని విజయ్‌బాబు ప్రకటించినప్పటికీ జనసేనలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు ఆయన్ను బాధించాయని చెబుతున్నారు. నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరినప్పటి నుంచి పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కు రహస్య సంబంధాలున్నాయని చాలామంది కాపు నాయకులు కూడా ఇప్పుడిప్పుడే విశ్వసిస్తూ ఉండడం కూడా పార్టీలో అలజడికి కారణం అవుతోంది.

స్వచ్చమైన రాజకీయాలకు జనసేన వేదిక అవుతుందని చెప్పిన పవన్‌ కల్యాణ్… అందుకు భిన్నంగా వివాదాస్పద వ్యక్తులను, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించడం, పవన్ రాజకీయ విధానం అనుమానాస్పదంగా ఉండడం వల్లే విజయ్‌బాబు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. జనసేనలో చురుగ్గా వ్యవహరించిన మరో అధికార ప్రతినిధి కూడా పార్టీని వీడుతారని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News