తండ్రిని "రెడ్డి"ని చేసిన సుజనా చౌదరి

బ్యాంకులను ఆరువేల కోట్లకు ముంచిన టీడీపీ ఎంపీ సుజనాచౌదరి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మోసం చేయడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాల్లోనూ సుజనా దూసుకెళ్లారు. చివరకు తన తండ్రి పేరుకు కూడా మార్పులు చేర్పులు చేశారు. తండ్రి పేరు మీద రిజిస్టార్‌ ఆఫ్ కంపెనీస్‌ నుంచి డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ (DIN) పొందేందుకు వేయకూడని ఎత్తు వేశారు సుజనా చౌదరి. తండ్రి పేరు మీద రెండు డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్లు తీసుకున్న సుజనా చౌదరి రికార్డుల్లో ఒక చోట […]

Advertisement
Update:2018-12-01 03:30 IST

బ్యాంకులను ఆరువేల కోట్లకు ముంచిన టీడీపీ ఎంపీ సుజనాచౌదరి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మోసం చేయడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాల్లోనూ సుజనా దూసుకెళ్లారు.

చివరకు తన తండ్రి పేరుకు కూడా మార్పులు చేర్పులు చేశారు. తండ్రి పేరు మీద రిజిస్టార్‌ ఆఫ్ కంపెనీస్‌ నుంచి డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ (DIN) పొందేందుకు వేయకూడని ఎత్తు వేశారు సుజనా చౌదరి.

తండ్రి పేరు మీద రెండు డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్లు తీసుకున్న సుజనా చౌదరి రికార్డుల్లో ఒక చోట తన తండ్రి పేరు జనార్దన్‌ రావు అని నిజం చెప్పారు. మరో నెంబర్‌ను నిబంధనలకు విరుద్దంగా తీసుకునేందుకు మరోసారి తన తండ్రిపేరు జనార్దన్‌ రెడ్డి అని చూపించారు.

వైఎస్‌ చౌదరి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న చిరునామా, పాన్‌ నంబర్లతోనే వైఎస్‌ జనార్ధన రావు, వైఎస్‌ జనార్ధన రెడ్డి పేర్ల మీద రెండు DINలను సుజనాచౌదరి పొందారు. దీనిపై తొలుత యూపీకి చెందిన న్యాయవాదులు రిజిస్టార్‌ ఆఫ్ కంపెనీస్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రానికి చెందిన ఇమన్నేని రామారావు అనే న్యాయవాది కూడా దీనిపై ఫిర్యాదు చేయడంతో ఆర్‌ఓసీ విచారణ జరిపింది.

అక్రమాలను గుర్తించింది. కంపెనీల చట్టం ప్రకారం వివిధ కంపెనీల్లో డైరెక్టర్‌గా చేరేవారికి ఒక డిన్‌ నంబర్‌ను మాత్రమే ఆర్‌ఓసీ ఇస్తుంది. సదరు డైరెక్టర్‌ కంపెనీ మారినా డిన్‌ నంబర్‌ మారదు. సదరు వ్యక్తి ఎన్ని కంపెనీల్లో ఉన్నారన్నది దీని ఆధారంగా తెలుసుకోవచ్చు.

ఆర్‌ఓసీ నిబంధనలకు విరుద్దంగా మోసం చేసి తప్పుడు పేరుతో DIN పొందినందుకు జైలు శిక్ష విధించేలా చట్టం కూడా ఉంది. మొత్తం మీద సుజనాచౌదరి తన మోసాల కోసం తండ్రి వైఎస్‌ జనార్దన్‌ రావు పేరును… వైఎస్‌ జనార్దన్‌ రెడ్డిగా మార్చిన తీరు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News