సుజనాచౌదరికి ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ
టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి చుక్కెదురైంది. ఆరు వేల కోట్లకు బ్యాంకులను ముంచిన కేసులో ఆయనకు ఇది వరకే ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను రద్దు చేయాలంటూ సుజనా చౌదరి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ సమన్లు రద్దు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈడీ దర్యాప్తుకు అడ్డుపడబోమని స్పష్టం చేసింది. సుజనాచౌదరి వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈడీ ముందు హాజరుకావాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. వివిధ బ్యాంకుల నుంచి ఆరు వేల కోట్ల […]
టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి చుక్కెదురైంది. ఆరు వేల కోట్లకు బ్యాంకులను ముంచిన కేసులో ఆయనకు ఇది వరకే ఈడీ సమన్లు జారీ చేసింది.
ఈ సమన్లను రద్దు చేయాలంటూ సుజనా చౌదరి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ సమన్లు రద్దు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈడీ దర్యాప్తుకు అడ్డుపడబోమని స్పష్టం చేసింది. సుజనాచౌదరి వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈడీ ముందు హాజరుకావాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
వివిధ బ్యాంకుల నుంచి ఆరు వేల కోట్ల రూపాయల మేర రుణాలు తీసుకుని ఆ సొమ్మును షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించారు సుజనా చౌదరి. తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసినా ఇచ్చిన రుణంలో ఐదు శాతం కూడా రికవరీ అయ్యే పరిస్థితి లేదు.
ఈ నేపథ్యంలో బ్యాంకులు దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశాయి. తొలుత సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది. వాటి ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. షెల్ కంపెనీల ద్వారా వేల కోట్ల నిధులు దారి మళ్లించి బ్యాంకును ముంచినట్టు తేల్చింది.
ఇటీవలే హైదరాబాద్‌లోని సుజనా నివాసం, కార్యాలయాలపై ఈడీ దాడులు నిర్వహించింది. పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుంది. సుజనాకు చెందిన ఆరు లగ్జరీ కార్లను సీజ్ చేసింది ఈడీ.
సోమవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ సమన్లు జారీ చేసింది. ఈడీ ముందుకు వెళ్లేందుకు ససేమిరా అన్న సుజనా… సమన్లు రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడ చుక్కెదురైంది.