ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్న రేవంత్ రెడ్డి

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. మూడు రోజుల పాటు తాను ప్రచారంలో పాల్గొనడం లేదని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తనను హత్య చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోందని, అందుకే ప్రచారాన్ని రద్దు చేసుకున్నట్టు రేవంత్ రెడ్డి వివరించారు. మావోయిస్టుల ముసుగులో తనపై దాడికి కుట్ర జరుగుతోందని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయంగా తన హోదా పెరిగినా భద్రతను మాత్రం తగ్గించారన్నారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలపై పోరాటం చేస్తున్న తనను […]

Advertisement
Update:2018-11-30 08:15 IST

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. మూడు రోజుల పాటు తాను ప్రచారంలో పాల్గొనడం లేదని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

తనను హత్య చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోందని, అందుకే ప్రచారాన్ని రద్దు చేసుకున్నట్టు రేవంత్ రెడ్డి వివరించారు. మావోయిస్టుల ముసుగులో తనపై దాడికి కుట్ర జరుగుతోందని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు.

రాజకీయంగా తన హోదా పెరిగినా భద్రతను మాత్రం తగ్గించారన్నారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలపై పోరాటం చేస్తున్న తనను అడ్డుతొలగించుకుంటామని కేసీఆర్ అసెంబ్లీలోనే చెప్పారన్నారు.

అందుకే తన పర్యటనకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆందోళన చెందారు. కేంద్ర బలగాలతో తనకు 4+4 గన్‌మెన్ల భద్రతను కల్పించాలని హైకోర్టు ఆదేశించినా ఇప్పటి వరకు కేంద్రం నుంచి అలాంటి చర్యలే మొదలుకావడం లేదన్నారు.

Tags:    
Advertisement

Similar News