నిజంగా రాహుల్‌ అన్నాడా? వీళ్ళు పుట్టించారా?

పార్టీని నమ్ముకున్న నాయకులతో పనిలేదు.. వారి మనోభావాల ముచ్చటే లేదు. చంద్రబాబుతో జతకట్టిన రాహుల్ గాంధీ…. సొంత పార్టీ నేతల ఆత్మాభిమానాన్ని, వారి అనుమతి లేకుండానే తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌, చంద్రబాబు కలిసి ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య ఏపీ రాజకీయాలపై చర్చలు జరిగాయట. దాన్ని ఉటంకిస్తూ టీడీపీ అనుకూల పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం చదివితే ఆత్మాభిమానం పేరుతో ఇతర పార్టీల్లో చేరకుండా […]

Advertisement
Update:2018-11-29 05:50 IST

పార్టీని నమ్ముకున్న నాయకులతో పనిలేదు.. వారి మనోభావాల ముచ్చటే లేదు. చంద్రబాబుతో జతకట్టిన రాహుల్ గాంధీ…. సొంత పార్టీ నేతల ఆత్మాభిమానాన్ని, వారి అనుమతి లేకుండానే తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌, చంద్రబాబు కలిసి ప్రచారం చేస్తున్నారు.

ఈ సమయంలోనే ఇద్దరి మధ్య ఏపీ రాజకీయాలపై చర్చలు జరిగాయట. దాన్ని ఉటంకిస్తూ టీడీపీ అనుకూల పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం చదివితే ఆత్మాభిమానం పేరుతో ఇతర పార్టీల్లో చేరకుండా కాంగ్రెస్‌నే నమ్ముకుని బతుకుతున్నఏపీ నేతలు… రెక్కలు విప్పాల్సిందే.

పత్రిక కథనం ప్రకారం… రాహుల్‌గాంధీ-చంద్రబాబు మధ్య ఏపీలో పొత్తుపై చర్చ రాగా…. రాహుల్‌ గాంధీ మీకు ఎలా లాభమైతే అలాగే చేయండి అని

చంద్రబాబుకు చెప్పేశారట. వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటే అలాగే చేద్దాం… ఒకవేళ విడివిడిగా పోటీ చేస్తే మీకు లాభం జరుగుతుందంటే అలాగే చేద్దాం అని రాహుల్ గాంధీ…. చంద్రబాబుకు చెప్పారట.

ఒకవేళ సదరు పత్రిక చెప్పిందే నిజమైతే… ఇక ఏపీ కాంగ్రెస్‌కు ఆత్మ, ఆత్మగౌరవం రెండూ లేనట్టే. ప్రధాని కావాలనుంటున్న రాహుల్‌ గాంధీ…. చంద్రబాబుతో స్నేహం కోసం ఏపీ కాంగ్రెస్‌ను చంద్రబాబు ఇష్టానికి వదిలేశారనే అనుకోవాలి. మీకు ఎలా లాభం జరుగుతుందనుకుంటే అలాగే చేద్దామని రాహుల్ గాంధీ నిజంగానే చెప్పి ఉంటే…. ఇది కూడా ఎప్పటిలాగే లీకు వార్త కాకుంటే…. రాహుల్‌కు ఏపీ కాంగ్రెస్‌ నేతలంటే ఎంత చులకనో అర్థం చేసుకోవచ్చు.

పొత్తు పెట్టుకునేందుకు అభ్యంతరం లేదని రాహుల్‌ చెప్పి సరిపెట్టి ఉంటే తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మీకు(టీడీపీకి, చంద్రబాబుకు) ఎలా లాభం అనుకుంటే అలాగే ఏపీలో చేయండి అని, ఏపీ కాంగ్రెస్ నేతలను సంప్రదించకుండానే రాహుల్ చెప్పారు అంటే ఏపీ కాంగ్రెస్‌ను రాహుల్‌ గాంధీ చచ్చిన శవంతో సమానంగానే చూస్తున్నారని భావించాల్సి ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News