టీడీపీ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు
అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఈరన్న అనేక విషయాలు దాచారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈరన్న పై వేటు వేసింది. కర్నాటకలో తనపై ఉన్న కేసును అఫిడవిట్‌లో ఈరన్న వెల్లడించలేదు. దాంతో పాటు తన భార్య ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న విషయాన్ని కూడా అఫిడవిట్‌లో చెప్పకుండా దాచారు. ఈరన్న అఫిడవిట్‌లో నిజాలు దాచారంటూ 2014 ఎన్నికలు ముగిసిన వెంటనే వైసీపీ అభ్యర్థిగా […]
అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఈరన్న అనేక విషయాలు దాచారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈరన్న పై వేటు వేసింది.
కర్నాటకలో తనపై ఉన్న కేసును అఫిడవిట్‌లో ఈరన్న వెల్లడించలేదు. దాంతో పాటు తన భార్య ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న విషయాన్ని కూడా అఫిడవిట్‌లో చెప్పకుండా దాచారు. ఈరన్న అఫిడవిట్‌లో నిజాలు దాచారంటూ 2014 ఎన్నికలు ముగిసిన వెంటనే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తిప్పేస్వామి పిటిషన్ వేశారు.
ఈరన్నపై అనర్హత వేటు వేసిన హైకోర్టు … ఈరన్న స్థానంలో ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తిప్పేస్వామి ఉండవచ్చని చెప్పింది. అయితే హైకోర్టు తీర్పుపై ఈరన్న అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఆర్డర్ కాపీ రాగానే ఈసీని కలుస్తామని వైసీపీ నేత తిప్పేస్వామి చెప్పారు.