పటేల్ విగ్రహం కంటే ఎత్తుగా రాముడి విగ్రహ ఏర్పాటు

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం భారీ రాముడి విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. అయోధ్యలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. 221 మీటర్ల ఎత్తు గల ఈ విగ్రహ ఏర్పాటు కోసం నమూనాలను సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పరిశీలించారు. ప్రస్తుతం దేశంలో అత్యంత ఎత్తైన విగ్రహంగా ఇటీవల ఏర్పాటు చేసిన సర్దార్‌ వల్లబాయ్ పటేల్ విగ్రహం ఉంది. వేదికతో కలిసి పటేల్ విగ్రహం ఎత్తు 182 మీటర్లుగా ఉంది. మర్యాద పురుషోత్తం పేరుతో అయోధ్యలో భారీ రాముడి విగ్రహం ఏర్పాటు […]

Advertisement
Update:2018-11-26 04:24 IST

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం భారీ రాముడి విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. అయోధ్యలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

221 మీటర్ల ఎత్తు గల ఈ విగ్రహ ఏర్పాటు కోసం నమూనాలను సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పరిశీలించారు.

ప్రస్తుతం దేశంలో అత్యంత ఎత్తైన విగ్రహంగా ఇటీవల ఏర్పాటు చేసిన సర్దార్‌ వల్లబాయ్ పటేల్ విగ్రహం ఉంది.

వేదికతో కలిసి పటేల్ విగ్రహం ఎత్తు 182 మీటర్లుగా ఉంది. మర్యాద పురుషోత్తం పేరుతో అయోధ్యలో భారీ రాముడి విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విగ్రహాన్ని కంచుతో తయారు చేయించనున్నారు.

వేదిక ఎత్తు 50 మీటర్లు, దానిపై 151 మీటర్ల ఎత్తుతో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. విగ్రహం పైభాగంలో 20 మీటర్ల ఎత్తుతో గొడుగు ఏర్పాటు చేస్తారు. వేదిక భాగం లోపల రాముడికి సంబంధించిన చరిత్రను వివరిస్తూ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News