లోక్‌సభకు కూడా వెళ్లనివ్వలేదు " ఎంపీ విశ్వేశ్వరరెడ్డి సంచలన ఆరోపణలు
టీఆర్‌ఎస్‌లో ఆత్మగౌరవానికి చోటు లేదన్నారు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. టీఆర్‌ఎస్ పార్టీలో చర్చకు అవకాశమే ఉండదన్నారు. నిజాం రాజు కూడా కేసీఆర్ అంత నియంతృత్వ పాలన చేసి ఉండరన్నారు. కేసీఆర్, కేటీఆర్ తీరుపై ఎంపీలు జితేందర్ రెడ్డి, కేకేలు కూడా అంసతృప్తితో ఉన్నారని వివరించారు. ఆర్థిక మంత్రి ఈటలకు బడ్జెట్ ఎలా ఉంటుందో అసెంబ్లీలో ప్రవేశపెట్టే వరకు తెలియదని, పోలీసుల బదిలీల ఆర్డర్ బయటికి వెళ్లేవరకు హోంమంత్రికి తెలియని పరిస్థితి టీఆర్‌ఎస్ […]
టీఆర్‌ఎస్‌లో ఆత్మగౌరవానికి చోటు లేదన్నారు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. టీఆర్‌ఎస్ పార్టీలో చర్చకు అవకాశమే ఉండదన్నారు. నిజాం రాజు కూడా కేసీఆర్ అంత నియంతృత్వ పాలన చేసి ఉండరన్నారు. కేసీఆర్, కేటీఆర్ తీరుపై ఎంపీలు జితేందర్ రెడ్డి, కేకేలు కూడా అంసతృప్తితో ఉన్నారని వివరించారు.
ఆర్థిక మంత్రి ఈటలకు బడ్జెట్ ఎలా ఉంటుందో అసెంబ్లీలో ప్రవేశపెట్టే వరకు తెలియదని, పోలీసుల బదిలీల ఆర్డర్ బయటికి వెళ్లేవరకు హోంమంత్రికి తెలియని పరిస్థితి టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉందన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి… వేల కోట్లు దోచేసి… అప్పు సొమ్ము నుంచి వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తే సరిపోతుందా? అని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు.
టీఆర్‌ఎస్ నేతలు తనను వ్యక్తిగతంగానూ ఇబ్బంది పెట్టారన్నారు. చివరకు తాను వేసుకునే డ్రెస్ పైనా కామెంట్లు చేయడం బాధ కలిగించిందన్నారు.
లోక్‌సభకు గెర్హాజరు కాకుండా వెళ్లి రోల్ మోడల్‌గా ఉండాలని తాను ప్రయత్నించానని… కానీ దాన్ని కూడా అడ్డుకున్నారని ఆరోపించారు. పార్లమెంట్ సమీపంలోకి కూడా వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారన్నారు. టీఆర్‌ఎస్ పెద్దలు ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను గాడిదలను కొన్నట్టుగా కొన్నారని మండిపడ్డారు.