సత్రాజిత్తు

సత్రాజిత్తు పేరు మీరు వినే ఉంటారు. శమంతకమణి కథ మీకు తెలిసే ఉంటుంది. ఆ మణి చుట్టూ తిరిగిన సత్రాజిత్తు కథను మననం చేసుకుందాం. సత్యభామ తెలుసుగా, ఆ సత్యభామకు తండ్రే సత్రాజిత్తు. ఈ సత్రాజిత్తు నిమ్నుని కుమారుడు. ఒక రోజున సత్రాజిత్తు స్నానము చేస్తూ ఉదయిస్తున్న బాల భాస్కరుని స్తోత్రము చేస్తాడు. దాంతో సూర్యుడు సంతోషపడ్డాడు. మెచ్చి సత్రాజిత్తునకు శమంతక మణిని కూడా ఇచ్చాడు. ఆ మణిని తనకిమ్మని శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని అడిగేవాడు. అందుకు సత్రాజిత్తు […]

Advertisement
Update:2018-11-26 02:47 IST

సత్రాజిత్తు పేరు మీరు వినే ఉంటారు. శమంతకమణి కథ మీకు తెలిసే ఉంటుంది. ఆ మణి చుట్టూ తిరిగిన సత్రాజిత్తు కథను మననం చేసుకుందాం.

సత్యభామ తెలుసుగా, ఆ సత్యభామకు తండ్రే సత్రాజిత్తు. ఈ సత్రాజిత్తు నిమ్నుని కుమారుడు.

ఒక రోజున సత్రాజిత్తు స్నానము చేస్తూ ఉదయిస్తున్న బాల భాస్కరుని స్తోత్రము చేస్తాడు. దాంతో సూర్యుడు సంతోషపడ్డాడు. మెచ్చి సత్రాజిత్తునకు శమంతక మణిని కూడా ఇచ్చాడు. ఆ మణిని తనకిమ్మని శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని అడిగేవాడు. అందుకు సత్రాజిత్తు అంగీకరించలేదు. మణిని ఇవ్వలేదు. అయితే సత్రాజిత్తునికి ప్రసేనుడనే సోదరుడున్నాడు. ఆ సోదరుడే మణిని ధరిస్తూ ఉండే వాడు. అలా మణిని వేసుకుని అడవిలోకి వెళ్లిన ప్రసేనునిపై సింహం దాడి చేసి చంపేస్తుంది. మణిని పట్టుకుపోతుంది.

కానీ శ్రీకృష్ణుడే మణి కోసం ప్రసేనుని చంపినాడని సత్రాజిత్తు నిందవేస్తాడు. చవితి రోజు చంద్రుణ్ణి చూసినందువల్లే శ్రీకృష్ణునిపై ఈ నింద పడ్డట్టు మీరెరిగిన ఇది వరకు చెప్పుకున్న కథే.

అయితే శ్రీకృష్ణుడు తనపై పడ్డ అపవాదుని పోగొట్టుకోవడానికి శమంతక మణిని వెతికాడు. సింహాన్ని చంపి మణిని తనతో తెచ్చుకున్నాడు జాంబవంతుడు. శ్రీకృష్ణుడు మణి కోసం జాంబవంతునితో యుద్ధం చేశాడు. శమంతక మణిని గెలుచుకున్న శ్రీకృష్ణుడు తిరిగి ఆ మణిని సత్రాజిత్తుకు ఇచ్చేశాడు.

సత్రాజిత్తు జరిగిన విషయం తెలుసుకుని శమంతకమణితోపాటు కూతురు సత్యభామను శ్రీకృష్ణునకు ఇచ్చాడు. శ్రీకృష్ణుడు మణిని తిరిగి సత్రాజిత్తునకిచ్చి సత్యభామను పెళ్లి చేసుకున్నాడు.

ఈ శమంతకమణి కోసమే శతధ్వనుడు సత్రాజిత్తుని యుద్ధంలో చంపేశాడని చెబతారు.

 

 

 

– బమ్మిడి జగదీశ్వరరావు

Tags:    
Advertisement

Similar News