భారత రాజ్యాంగ రక్షణకు చంద్రబాబును కలుస్తా " గద్దర్‌

ఒకప్పుడు గద్దర్‌ శరీరంలోకి తూటాలు దింపించింది చంద్రబాబే అన్న ఆరోపణ ఉంది. ఇప్పుడే అదే చంద్రబాబును కలుస్తానంటున్నారు గద్దర్. అది కూడా భారత రాజ్యాంగాన్ని రక్షించేందుకు ఉద్యమంలో చంద్రబాబు సాయం తీసుకుంటానని ప్రకటించారు. త్వరలో చంద్రబాబును కలుస్తానని వెల్లడించారు. ఇప్పటి వరకు తనను ఒకవైపే చూశారని…. ఇకపై రెండో వైపు చూస్తారని గద్దర్ చెప్పారు. గజ్వేల్ నుంచి పోటీ చేయాలని తొలుత భావించానని…. కానీ ప్రజా ఉద్యమం కోసమే పోటీ చేయలేదని చెప్పారు. కేసీఆర్‌ పాలనలో అవినీతి, […]

Advertisement
Update: 2018-11-22 23:01 GMT

ఒకప్పుడు గద్దర్‌ శరీరంలోకి తూటాలు దింపించింది చంద్రబాబే అన్న ఆరోపణ ఉంది. ఇప్పుడే అదే చంద్రబాబును కలుస్తానంటున్నారు గద్దర్. అది కూడా భారత రాజ్యాంగాన్ని రక్షించేందుకు ఉద్యమంలో చంద్రబాబు సాయం తీసుకుంటానని ప్రకటించారు. త్వరలో చంద్రబాబును కలుస్తానని వెల్లడించారు.

ఇప్పటి వరకు తనను ఒకవైపే చూశారని…. ఇకపై రెండో వైపు చూస్తారని గద్దర్ చెప్పారు. గజ్వేల్ నుంచి పోటీ చేయాలని తొలుత భావించానని…. కానీ ప్రజా ఉద్యమం కోసమే పోటీ చేయలేదని చెప్పారు. కేసీఆర్‌ పాలనలో అవినీతి, అక్రమాలపై ప్రజల్లో చైతన్యం తెస్తానన్నారు. 70 ఏళ్ల వయసులో తాను ఓటరుగా నమోదు అయ్యానని చెప్పారు.

అన్నీ బాగానే ఉన్నా రాజ్యాంగాన్ని రక్షించేందుకు చంద్రబాబుతో చేతులు కలుపుతానని గద్దర్ చెప్పడమే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. భారత రాజ్యాంగానికి విరుద్దంగా 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని… వారిలో నలుగురితో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించి మరీ రాజ్యాంగాన్ని అవహేళన చేసిన చంద్రబాబును రాజ్యాంగాన్ని రక్షించేందుకు పిలుపునివ్వడం విచిత్రమే.

Tags:    
Advertisement

Similar News